Menu



మెగా బ్రదర్ నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద' అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ మెగా అభిమానులు కొన్ని రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఎదు చూపులకు తెర పడింది.



 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని వరుణ్ తేజ్ ‘ముకుంద' ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇటీవల శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ‘ముకుంద' టైటిల్ ప్రకటించారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లలో వరుణ్ తేజ్ లుక్ అదరి పోయింది.



‘ముకుంద' చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. లియో ఎంటర్టెన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
వరుణ్ తేజ్ ఈచిత్రంలో లవర్ బాయ్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తోంది.




సాధారణంగా తొలి సినిమా అనగానే పెర్ఫార్మెన్స్ పరంగా కాస్త పూర్‌గా ఉంటారు. అయితే వరుణ్ తేజ్ మాత్రం యాక్టింగ్, డాన్స్ తదితర అంశాల్లో చాలా మెచ్యూరిటీ చూపిస్తున్నాడట. పలు చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్నవాడిలా వీలైనంత వరకు ఎక్కువగా టేకులు తీసుకోకుండా పర్‌ఫెక్టుగా చేస్తున్నాడట.

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ వాలీబాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడని సమాచారం. బ్రహ్మానందం,ప్రకాష్ రాజ్, నాజర్, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఠాగూర్‌ మధు, నల్లమలుపు బుజ్జి నిర్మాతలు.

0 comments:

Post a Comment

 
Top