ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ తన పై అదేవిధంగా హీరోయిన్ ఛార్మీ పై వస్తున్న గాసిప్పు వార్తల పై స్పందించాడు. తనకు ఛార్మీకి ఏదో ఎఫైర్ ఉంది అంటూ మీడియా ఎందుకు కట్టు కథలు రాస్తోందో తనకు అర్ధం కావడం లేదని మీడియా పై కామెంట్స్ చేసాడు పూరి.
తాను ఛార్మీ ఈమధ్య తరుచుగా కలుస్తున్న విషయం వాస్తవమే అయినా తాను ఛార్మీ తో తీస్తున్న ‘జ్యోతిలక్ష్మి’ సినిమా స్క్రిప్ట్ గురించి మాట్లాడుకోవడానికి మాత్రమే అనీ ఆ విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకుని మీడియా తప్పుడు రాతలు రాస్తోoదని మీడియా పై ఎదురు దాడికి దిగాడు పూరి.
తాను ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా ఈ సినిమాను ఛార్మీతో చాల డిఫరెంట్ గా తీస్తున్నానని వివరించాడు పూరి. తన ‘టెంపర్’ విషయం పై మాట్లాడుతూ మీడియా వార్తలు వ్రాస్తున్నట్లుగా ఈ సినిమా కథ ముంబాయి పోలీసు ఆఫీసర్ దయానంద్ జీవితాన్ని చూసి ప్రభావితమై రాసిన కథ కాదని ఇది అందరి ఊహలకు భిన్నంగా ఉండే కధ అని మరో ట్విస్ట్ ఇచ్చాడు పూరి.
అదేవిధంగా తన బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుతూ తాను ఎప్పటికైనా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లతో సినిమా చేసి తీరతానని తన భవిష్యత్ ప్రణాళికలు వివరించాడు పూరి. ఛార్మీతో తన స్నేహం గురించి బహిరంగ వివరణ ఇచ్చాడు కాబట్టి ఇక ఈ గాసిప్పులకు తెరపడినట్లే.
source;http://www.apherald.com/MOVIES/ViewArticle/77939/PURI-RESPONDED-ON-CHARMEE-RUMOURS/
0 comments:
Post a Comment