గతనెల జనవరి 28వ తారీఖునాడు తన పుట్టినరోజును జరుపుకున్న శ్రుతిహాసన్ కు ఒక అరుదైన గిఫ్ట్ ను కానుకగా ఇచ్చి శ్రుతిని ఆశ్చర్య పరిచాడు కమలహాసన్. అటువంటి బహుమతి కావాలని శ్రుతి అడగక పోయినా కమల్ ఆమెకు ఆ బహుమతి ఇవ్వడంతో శ్రుతిహాసన్ మంచ్ జోష్ మీద ఉంది. ఇంతకీ శ్రుతికి కమల్ ఇచ్చిన బహుమతి తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
ఈమధ్యనే కమల్ అమెరికా నుండి ఆమె కోసం స్క్రిప్ట్ రైటింగ్ సాఫ్ట్ వేరును తీసుకు వచ్చి శ్రుతికి పుట్టినరోజు బహుమతిగా ఇచ్చాడని శ్రుతి చెపుతోంది. అంతేకాదు పాటలు, పొయిట్రీ, షార్ట్ స్టోరీస్ రాసే శ్రుతిని తన సినిమాల కోసం మంచి కథను ఈ స్క్రిప్ట్ రైటింగ్ సాఫ్ట్ వేర్ సహాయంతో తనకు తయారు చేసి పెట్టమని అడిగాట కమల్.
దీనికోసం మంచిమంచి విదేశీ సినిమాలు చూస్తూ వెరైటీ కథలను ఆలోచించమని కమల్ సలహా ఇచ్చాడు అని చెపుతోంది శ్రుతి. దీనితో ప్రస్తుతం తన సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నా తన తండ్రి కోసం ఒక మంచి కథను తయారు చేసే పనిలో పడ్డాను అని చెపుతోంది శ్రుతి.
శ్రుతి టాలెంట్ బయటకు వచ్చింది కాబట్టి కథల కోసం ఇబ్బంది పడుతున్న మన టాప్ యంగ్ హీరోలు శ్రుతిని సంప్రదిస్తే ఏమైనా మంచి కథలు ఇస్తుందేమో చూడాలి.
source;http://www.apherald.com/MOVIES/ViewArticle/77985/SHRUTI-GOT-SHOCKED-WITH-HIS-FATHER-GIGT/
0 comments:
Post a Comment