Menu

Telugu Actor Varun Tej-with-puri
వరుణ్‌ ‘ముకుంద’సినిమా విడుదల సమయంలో అతడి తర్వాతి సినిమా ఏదన్న విషయంలో చాలా సస్పెన్స్ నడిచింది. ఓసారి క్రిష్‌తో తన రెండో సినిమా చేస్తాడని.. ఇంకోసారి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అతడి రెండో సినిమా ఉంటుందని రకరకాలుగా ప్రచారం జరిగింది. మధ్యలో వరుణ్‌తో బోయపాటి కూడా సినిమా చేయొచ్చన్న రూమర్ కూడా నడిచింది. ఐతే ‘ముకుంద’ సినిమా సందడి ముగిసిపోగానే మెగా కుర్రాడి గురించి మాట్లాడ్డం మానేశారు. ఐతే వరుణ్ తర్వాతి సినిమాల విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది.

వరుణ్ రెండో సినిమాను తెరకెక్కించేది క్రిష్ అని తేలిపోయింది. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తాడు. దీని తర్వాత వరుణ్  పూరి జగన్నాథ్‌తో సినిమా చేస్తాడు. అయితే వరుణ్ కోసం పూరి కథ రెడీ చేశాడని  టెంపర్ అవగానే ఈ సినిమా వరుణ్ రెండో సినిమా మొదలు కావచ్చన్న ప్రచారం ఉత్తదే అని తేలిపోయింది. పూరి తన తర్వాతి సినిమాను ఛార్మితోనే చేయబోతున్నాడని తేలిపోయింది. ఇక వరుణ్‌తో సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ నిర్మిస్తాడట. క్రిష్‌తో చేయబోయే సినిమా కోసం వరుణ్ తన లుక్‌ను మార్చుకునే పనిలో ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం క్రిష్ ‘ఠాగూర్’ హిందీ రీమేక్ ‘గబ్బర్’ పనుల్లో బిజీగా ఉన్నాడు . మార్చి వరకు అతను ఖాళీ అవడు. ఏప్రిల్‌లో వరుణ్, క్రిష్ కాంబినేషన్లో సినిమా మొదలయ్యే అవకాశముంది. ఏడాది ఆఖరుకు పూరి సినిమా పట్టాలెక్కవచ్చు.

0 comments:

Post a Comment

 
Top