Menu

temperbussiness

యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ 'టెంపర్' చిత్రం ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మొదటి షో హైదరాబాద్ భ్రమరాంబ థియోటర్ లో ఉదయం 5.07 నిముషాలకు విడుదల కానున్నదని సమాచారం. ఇప్పటికే నిర్మాత బండ్ల గణేష్ ఈ విషయమై ప్రకటన చేసి ఉన్నారు. అలాగే .. భ్రమరాంబ థియోటర్ లో గతంలో బాలకృష్ణ లెజండ్ చిత్రం విడుదలైంది.

సీడెడ్ లోనూ చాలా చోట్ల 13 వేకువజామునుండే షోలు పడతాయి. అయితే అఫీషియల్ గా ముహూర్తం మాత్రం భ్రమరాంబలో జరగనుంది. ఇక చిత్రం విశేషాలకు వస్తే... తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈచిత్రాన్ని వెస్ట్ గోదావరిలో పూరి జగన్నాథ్ ముందే చెప్పినట్టుగా స్వయంగా విడుదల చేయబోతున్నాడు. ఇందుకోసం ఆయన పాపులర్ డిస్ట్రిబ్యూటర్ సురేష్ మూవీస్‌తో జతకట్టినట్లు తెలుస్తోంది. ఈ జిల్లా రైట్స్ కోసం పూరి జగన్నాథ్ రూ. 2 కోట్ల 50 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తాను దర్శకత్వం వహించిన చిత్రాన్ని....ఇంత రేటు పెట్టి మరీ పూరి జగన్నాథ్ కొనడం హాట్ టాపిక్ గా మారింది.

'టెంపర్'సినిమాపై పూరి కు చాలా కాన్ఫిడెన్స్ ఉండబట్టే ఇలా చేసాడని అంటున్నారు. ఆడియో విడుదల తర్వాత ‘టెంపర్' సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రెస్పాన్స్ కు తగిన విధంగానే ఈ చిత్రాన్ని తొలిరోజు భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత బండ్ల గణేష్ ఏర్పాట్లు చేస్తున్నారు. వెయ్యికిపైగా థియేటర్లు ఇప్పటికే బుక్ చేసినట్లు సమాచారం. మరో వైపు అమెరికాలోనూ ఈ చిత్రాన్ని 100కుపైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రి రిలీజ్ బిజినెస్ 42 కోట్ల వరకూ జరిగిందని ట్రేడ్ వర్గాల అంచనా.

ఏరియావైజ్ డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్న రేట్లు :
నైజాం Rs. 11.00 కోట్లు సురేష్ మూవీస్
సీడెడ్ Rs. 6.30 కోట్లు శివ శక్తి ఫిల్మ్స్ 
నెల్లూరు Rs. 1.65 కోట్లు ఐకాన్ 
కృష్ణా Rs. 2.75 కోట్లు హరి పిక్చర్స్గుం
టూరు Rs. 3.30 కోట్లు ఎస్ క్రియేషన్స్వై
జాగ్ Rs. 4.00 కోట్లు భరత్ పిక్చర్స్ వెస్ట్ 
గోదావరి Rs. 2.30 కోట్లు సురేష్ మూవీస్ 
 ఈస్ట్ గోదావరి Rs. 2.52 కోట్లు అనుశ్రీ ఫిల్మ్స్ 
 మొత్తం Rs. 33.82 కోట్లు 
 కర్ణాటక Rs. 4.50 కోట్లు బృందా అశోసియేట్స్ 
 మిగిలిన ఏరియాలు Rs. 2.00 కోట్లు ఇంద్ర ఫిల్మ్స్ 
 ఓవర్ సీస్ Rs. 3.60 కోట్లు 
గ్రేట్ ఇండియా మొత్తం (ప్రపంచవ్యాప్తంగా) Rs. 43.92 కోట్లు 
ముఖ్య గమనిక: కేవలం ఇవి ట్రేడ్ లో చెప్పబడుతున్న లెక్కలు మాత్రమే

0 comments:

Post a Comment

 
Top