Menu

sunny-leone

అడల్ట్‌ స్టార్‌గా పోర్న్‌ సినిమాలు చేస్తూ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత దక్షిణాది సినిమాల పై కన్నేసిన సన్నీ లియోన్ వార్తలు రోజూ ఉండాల్సిందే. పోర్న్‌ సినిమాలు చేయడం పట్ల రిగ్రెట్స్‌ ఏమీ లేవని సన్నీలియోన్‌ ఎప్పుడో క్లారిటీ ఇచ్చేసింది.తనకు ఇంత క్రేజ్ రావడానికి తన పోర్న్ స్టార్ ఇమేజ్ తన సినిమా కెరియర్ కు బాగా కలిసి వచ్చిందని సన్నీ ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో బహిరంగానే చెప్పింది. ఈ అడల్ట్ స్టార్ ఇమేజ్ లేకపోతే తనకు ఎవరు అవకాశాలు ఇస్తారు అంటూ మీడియాకే ఎదురు ప్రశ్నలు వేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సన్నీలియోన్‌ ఓ బ్రాండ్‌గా మారిపోయిందనే విషయం అందరికీ తెలిసిన విషయమే.ఆమె నటిస్తే సినిమాకి మినిమమ్‌ వసూళ్ళు ఖాయం అన్న నమ్మకం బాలీవుడ్‌ నిర్మాతల్లోనూ గట్టిగా ఉంది. పోర్న్‌ రంగంలో ఎక్కువ కాలం ఎవరూ ఉండలేరు. సన్నీలియోన్‌ కూడా ఆ రంగం నుంచి బ్రేక్‌ కోరుకుందిట. బ్రేక్‌ కోరుకోగానే బాలీవుడ్‌ నుంచి అనూహ్యంగా ఆఫర్‌ వచ్చిందామెకి. వెనక్కి తిరిగి చూసుకోలేనంత తప్పు పనిగా అడల్ట్‌ యాక్ట్రెస్‌ కెరీర్‌ని ఎప్పుడూ అనుకోనని చెప్పే సన్నీలియోన్‌, దాన్ని ఓ ప్రొఫెషన్‌గానే ఇప్పటికీ ఓ అభిప్రాయాన్ని మైండ్‌లో ఫిక్స్‌ చేసుకుంది. ఈ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి మంచి పాత్రలు చేయాలని కోరిక ఉన్నా తన కోరికను ఎవరూ పట్టించుకోవడం లేదు అని గగ్గోలు పెడుతోంది. తన గత జీవితానికి సంబంధించిన పోర్న్ స్టార్ ఇమేజ్ గురించి తాను మరిచి పోదామని ప్రయత్నించినా తనను మరిచి పోనివ్వకుండా పదేపదే తన గతాన్ని మీడియా గుర్తుకు చేస్తోంది అని బాధపడుతోంది.

0 comments:

Post a Comment

 
Top