డైరెక్టర్ పూరి జగన్నాథ్ వెంట ఉంటూ... అతని ఆఫీసు చుట్టూ తిరుగుతూ... ఛార్మి అతడిని అంటి పెట్టుకుని ఉంటోందని రకరకాలుగా మాట్లాడుకుంటున్నా కానీ అవేం తనకి పట్టనట్టు జగన్ స్మరణ చేస్తూ గడిపేసింది. అపుడెప్పుడో బుడ్డా సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చిన దగ్గర్నుంచి జగన్‌కి అల్టిమేట్ ఫాలోవర్‌గా మారిపోయిన ఛార్మి ఎప్పటికైనా తనకి పూరి జగన్నాథే బ్రేకిస్తాడని ఎదురు చూసింది. ఆమెతో జ్యోతిలక్ష్మి అనే సినిమా తీస్తానని పూరి జగన్నాథ్ ప్రకటించినపుడు ఏదో ఉబ్బేయడానికే అనుకున్నారంతా. ఆ పాత్ర కోసమని ఛార్మి కష్టపడి ఒళ్లు తగ్గించింది. కానీ పూరి వేరే సినిమాలతో బిజీ అయిపోయి జ్యోలిలక్ష్మి పక్కన పడేసాడు.
కానీ ఇప్పుడు ఎన్ని సినిమాలు ఉన్నా ముందుగా ఛార్మి సినిమా పూర్తి చేస్తానని జ్యోతిలక్ష్మి పని మొదలు పెడుతున్నాడు. కెరీర్ పరంగా స్ట్రగుల్ అవుతున్న తనకి ఇప్పుడు ఈ బూస్ట్ చాలా అవసరమని, పూరి జగన్ ఇస్తోన్న ఎంకరేజ్‌మెంట్‌ని ఎప్పటికీ మర్చిపోలేనని, తనకి అతను దేవుడేనని ఆమె తెగ పొగిడేస్తోంది. పూరి జగన్నాథ్ ఒక లేడీ ప్రధాన సినిమా తీస్తున్నాడంటే ఆసక్తి ఖచ్చితంగా కలుగుతుంది. ఆ విధంగా జ్యోతిలక్ష్మి పాస్ అయిపోద్దేమో చూడాలి
0 comments:
Post a Comment