టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , పూరీ ల కాంబినేషన్ లో వస్తున్న ‘టెంపర్' సినిమా ఈ రోజు సెన్సార్ కు వెళ్ళ బోతోంది. అయితే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని తుది దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ ఫిలింనగర్ లో నిన్న హడావిడి చేసింది.
వస్తున్న వార్తల ప్రకారం ప్రముఖ నిర్మాత ఫైనాన్స్ షియర్ అయిన పొట్లూరి వరప్రసాద్ చివరి నిముషంలో ఈ సినిమాను చూసి కొన్ని మార్పులు చేయడంతో పాటు ఈ సినిమాలోని కొన్ని సీన్స్ పట్టుపట్టి తీయించేసారని టాక్.దీనికి కారణం పొట్లూరి వరప్రసాద్ ఈ సినిమాకు ఫైనాన్స్ చేసారు అనే వార్తలు ఫిలింనగర్ లో గట్టిగా వినిపిస్తున్నాయి.
దీనితో దర్శకుడు పూరీకి, నిర్మాత బండ్ల గణేష్ కు ఈ మార్పులు ఇష్టం లేకపోయినా పొట్లూరి వరప్రసాద్ కోసం ఈ మార్పులు చేసారని టాక్. పొట్లూరి మాట వినకపోతే సినిమా విడుదల సమయంలో ఏదో ఒక ఇబ్బంది పెడతారని బండ్ల గణేష్ భయ పడటం కూడా ఈ మార్పులకు కారణం అయింది అని అంటున్నారు.ఇటీవల ‘ఐ' సినిమాకు ఫైనాన్స్ చేసిన పివిపి సినిమా విడుదల సమయంలో కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉండగా ఈ 'సినిమా'ను ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా 1000 ధియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్క అమెరికాలోనే 100కుపైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అని టాక్.
ఇది ఇలా ఉంటే దర్శకుడు పూరి బ్రహ్మానందం, అలీలతో కామెడీ ట్రాక్ లేకుండా అన్ని విషయాలలోనూ భారం జూనియర్ పైనే మోపి యంగ్ టైగర్ ఇమేజ్ ని పూర్తిగా వాడుకుని ఈ సినిమా ద్వారా కొత్త జూనియర్ ను చూపెట్ట బోతున్నాడు అనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఇంతకీ ఈ ‘టెంపర్’ జూనియర్ కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ గా ఎంతవరకు నిలబడగలుగుతుందో చూడాలి.
0 comments:
Post a Comment