ప్రిన్స్' అంటూ 'కింగ్' అక్కినేని నాగార్జున ఫాన్స్ ముద్దుగా పిలుచుకుంటోన్న అఖిల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయ్. నాగచైతన్య లాంఛ్ అనుకున్నంత గొప్పగా జరగకపోయినా మిడ్ రేంజ్ హీరోగా ఏదో అలా సెటిలయ్యాడు. కానీ అఖిల్ మాత్రం సూపర్‌స్టార్ మెటీరియల్ అని నాగార్జునకి ఆల్రెడీ నమ్మకం కుదిరింది. అందుకే అఖిల్ లాంఛ్ ప్యాడ్ విషయంలో నాగ్ అస్సలు కాంప్రమైజ్ కాలేదు. అఖిల్ మొదటి సినిమా కోసం వినాయక్ అండ్ టీమ్ అద్భుతమైన కథ రెడీ చేస్తే... నితిన్ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు.
అఖిల్ పక్కన హీరోయిన్ ఎవరైతే బాగుంటుందా అని చాలా మంది పేర్లు పరిశీలించారు. ఆల్రెడీ పరిచయం అయిన హీరోయిన్లనీ స్క్రీన్ టెస్ట్ చేసారు. కానీ అఖిల్‌లాంటి అందగాడి పక్కన అంతే క్యూట్‌గా ఉన్న అమ్మాయి అయితేనే పెయిర్ పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని ఫైనల్‌గా సయేషా సైగల్‌ని ఖరారు చేసారు. నటుల కుటుంబానికే చెందిన సయేష త్వరలో బాలీవుడ్‌లో లాంఛ్ అవుతోంది. కానీ ఆమెకి ఇదే తొలి చిత్రమవుతుంది. అఖిల్‌తో పాటు సయేష కూడా పెద్ద రేంజ్‌కి వెళుతుందని ఆశిస్తూ బెస్టాఫ్ లక్ చెప్పేద్దాం.
source: http://telugu.gulte.com/tmovienews/8550/Shyesha-sehgal-in-Akhil-debut-movie#sthash.eKspWaXk.dpuf
0 comments:
Post a Comment