Menu


'టెంపర్‌' చిత్రానికి చిన్నపాటి కట్స్‌ మాత్రం చెప్పి యు/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చేసారు. 13న విడుదల కానున్న ఈచిత్రం గురించి ఈమధ్య కాలంలో చాలా పుకార్లు వినిపించాయి. బండ్ల గణేష్‌కి ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ఫిబ్రవరి 13న రిలీజ్‌ అవుతుందా లేదా అంటూ రూమర్స్‌ తారాస్థాయికి చేరాయి. కానీ సెన్సార్‌ పూర్తి చేసుకుని 13న విడుదల ఖరారు చేసుకున్న ఈ చిత్రానికి రిపోర్ట్స్‌ కూడా చాలా పాజిటివ్‌గా వినిపిస్తున్నాయి. ప్రతి సినిమా సెన్సార్‌ కాగానే వినిపించే ఇన్‌సైడ్‌ టాక్‌ 'టెంపర్‌'కి ఫుల్‌ పాజిటివ్‌గా ఉంది. 

ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ కావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. ఆద్యంతం వినోదంతో పాటు హీరోయిజమ్‌ కూడా చక్కగా కుదిరిందట. ఎన్టీఆర్‌, పూరి ఇద్దరూ ఫామ్‌లో లేకపోయినా కానీ ఈ చిత్రంలో ఇద్దరూ టాప్‌ ఫామ్‌లో తమ తమ కసి చూపించారని అంటున్నారు. తన గత రెండు చిత్రాలతో నిరాశ పరచిన ఎన్టీఆర్‌ ఈసారి గ్యారెంటీగా పెద్ద హిట్‌ కొట్టబోతున్నాడని కుండ బద్దలు కొట్టేస్తున్నారు. 


source: http://telugu.gulte.com/tmovienews/8549/NTR-hits-Blockbuster-for-sure#sthash.FSERNnzI.dpuf

0 comments:

Post a Comment

 
Top