కాజల్ జూనియర్ లో కనిపిస్తున్న మార్పును చూసి ఆశ్చర్యపోతున్నాను అని అంటోంది. ఇప్పటి వరకు మూడు సినిమాలలో జూనియర్ తో నటించిన కాజల్ ఎన్టీఆర్ లో వచ్చిన మార్పును విస్లేషాత్మకంగా వివరించింది. గతంలో జూనియర్ కి పెళ్ళికాక ముందు, పెళ్ళి అయ్యాక జూనియర్ తో సినిమాలు చేసిన తనకు జూనియర్ తండ్రి అయ్యాక యంగ్ టైగర్ లో అనేక మార్పులు తాను గమనించానని చెపుతోంది.
లేటెస్ట్ గా తాను జూనియర్ తో నటించిన ‘టెంపర్’ సినిమా షూటింగ్ స్పాట్ లో ఖాళీ దొరికితే చాలు జూనియర్ తన కొడుకు లిటిల్ జూనియర్ గురించి తాను అడగకుండానే అనేక విషయాలు చెప్పే వాడని కాజల్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.
అంతేకాదు జూనియర్ తండ్రిగా మారిన తరువాత తన నటన పట్ల మరింత ఏకాగ్రత పెంచాడని ఆ ఏకాగ్రత విశ్వరూపంగా మారి జూనియర్ ‘టెంపర్’ సినిమాలో అద్భుతమైన నటుడుని మనకు చూపెడుతుందని అంటూ ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేసింది కాజల్.
ఇదే సందర్భంలో ఆ మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ జూనియర్ తో కలిసి నటిస్తున్నప్పుడు ముఖ్యంగా పాటల చిత్రీకరణ సమయంలో స్టెప్స్ వేయడానికి తాను చాల కష్టపడవలసి వస్తుందని, అటువంటి కష్టం తనకు ఏ హీరోతోను డాన్స్ ల విషయంలో కలగలేదని ఈ విషయంలో దర్శకుడి టార్చర్ కన్నా జూనియర్ టార్చర్ చాల ఎక్కువ అంటూ జూనియర్ పై సెటైర్లు వేసింది కాజల్.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78401/KAJAL-SEES-CHANGE-IN-JUNIOR-BEHAVIOUR/
0 comments:
Post a Comment