Menu

టాలీవుడ్ ఫిల్మ్ ఇండీస్ట్రీలో మెగా హీరోగా ఎదిగిన హీరో, రామ్ చరణ్. రామ్ చరణ్ ప్రస్తుతం నటించబోతున్న అప్ కమింగ్ మూవీకి సంబంధించిన విషయాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వివరాల్లోకి వెళితే, రామ్‌చరణ్‌ హీరోగా రాబోతున్న అప్ కమింగ్ మూవీ, శరవేగంగా ముందుకు వేళుతుంది.

ఈ మూవీకి సంబంధించిన ఓపెనింగ్ ముహుర్తం, అలాగే రిలీజ్ డేట్స్ వంటి విషయాలు బయటకు వచ్చాయి. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. మార్చి 5న చిత్రాన్ని ప్రారంభించి, 16 నుంచి రెగ్యులర్‌ షూటింగ్ ని జరుపుకుంటుంది. అయితే ఈ మూవీకి 'మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

ఇక ఈ చిత్రం అక్టోబర్ 15న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై దర్శకుడు మాట్లాడుతూ ''యాక్షన్‌తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. భారీ తారాగణంతో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా తెరకెక్కిస్తాం'' అన్నారు. నిర్మాత డి.వి.వి దానయ్య మాట్లాడుతూ ''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. అక్టోబరు 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.

ఈ సినిమాకు 'కొలవెరి...' ఫేమ్‌ అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్‌, గోపీమోహన్‌ది విజయవంతమైన కాంబినేషన్‌ అనీ, ఆ కాంబినేషన్‌తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందని నిర్మాత దానయ్య అన్నారు. ఇదిలా ఉంటే, 'మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పై రామ్ చరణ్ సంతోషంగా లేనట్టు చిత్ర యూనిట్ టాక్స్ వినిపిస్తున్నాయి. అందుకే మరికొన్ని టైటిల్స్ ని చిత్రి యూనిట్ పరిశీలించే పనిలో ఉన్నారు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/79122/Ram-pawan-kalyan-power-star-pawan-movie-ram-movies/

0 comments:

Post a Comment

 
Top