Menu

మిల్కీ బ్యూటీగా ఒక దశాబ్ద కాలంగా టాలీవుడ్, కోలీవుడ్ లలో ఎన్నో సినిమాలలో నటించిన తమన్నాకు ఒక వింత కోరిక కలిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియ చేసింది. నటనకు ప్రాధాన్యత ఉన్న స్క్రిప్ట్ దొరికితే అందవికారంగా ఉండే డీ గ్లామరస్ పాత్రలను తనకు చేయాలని ఉంది అని అంటూ తన కోరికను బయట పెట్టింది తమన్నా.

ప్రస్తుతం రాజమౌళి సినిమాలో అవంతిక పాత్రలో తన గ్లామర్ చూపెడుతున్న తమన్నా అందం అన్నది ముఖానికి ఉండే రంగు బట్టి ఉండదని నల్లగా ఉన్నా ముఖం ఆకర్షణీయంగా ఉంటే ఎవరైనా సినిమా రంగంలో రాణించ వచ్చు అని చెపుతూ నల్లటి అమ్మాయిలకు కూడా ధైర్యం నూరి పోస్తోంది తమన్నా.

అయితే తమన్నాను మిల్కీ బ్యూటీగా ఆరాధించే ప్రేక్షకులు తమన్నా నటిగా మారి డీ గ్లామరస్ రోల్ చేస్తూ ఉంటే ధియేటర్లలో కూర్చుని సినిమాలు చూస్తారా? అన్నదే అర్ధంకాని ప్రశ్న.

అయితే తమన్నా కోరిక తెలిసింది కాబట్టి ఏ దర్శకుడైనా ఆమెకు ఇటువంటి డీ గ్లామర్ పాత్రలను ఆఫర్ చేసినా కోట్ల పై పారితోషికం పుచ్చుకునే తమన్నా తన పారితోషికాన్ని తన కోరికల కోసం పూర్తిగా తగ్గించి వేస్తే ఏ నిర్మాత అయినా సాహసిస్తాడు అనుకోవాలి. అప్పటి దాకా తమన్నా కోరికలు ఇలా మీడియా ఇంటర్వ్యూల వరకే పరిమితం.

source:http://www.apherald.com/Movies/ViewArticle/79099/TAMANNAH-DESIRES-BECOMING-SCHOCKING/

0 comments:

Post a Comment

 
Top