మంచి నటిగా పేరు వచ్చినా నిత్యామీనన్ స్థాయికి తగ్గ అవకాశాలు ఆమెకు టాలీవుడ్ లో రావడంలేదు. లేటెస్ట్ గా విడుదలైన ‘మళ్ళీమళ్ళీ ఇది రానిరోజు’ సినిమాలో నిత్యామీనన్ నటనకు ప్రశంసలు లభించినా ఆ సినిమా కలెక్షన్స్ పరంగా పూర్తిగా నిరాశ పరిచింది. దీనితో ప్రస్తుతం నిత్యామీనన్ ఆశలు అన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పైనే పెట్టుకుంది
బాలకృష్ణ దగ్గర నుంచి చాలామంది టాప్ హీరోలు ఆమెను మెచ్చుకుంటారు కానీ అవకాశాలు మాత్రం ఆమెకు ఇవ్వరు. ఈ నేపధ్యంలో ఈమె ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమధ్య ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యామీనన్ తాను త్వరలో దర్శకత్వం చేపట్టే అవకాశం ఉంది అంటూ ఒక బాంబు పేల్చింది.
తనకు పుస్తకాలు బాగా చదివే అలవాటు బాగా ఎక్కువ అని అంటూ ఒక ఈజిప్టియన్ సింగర్ యదార్ధ గాదను సినిమాగా తీయడానికి ప్రయత్నిస్తున్నాను అంటూ ఒక సంచలన విషయాన్ని బయట పెట్టింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను కూడా తాను త్వరలో మొదలు పెడతాను అని అంటోంది.
అయితే తన తలబిరుసుతో అనేక మంది దర్శకులకు తలనొప్పిగా నిత్య మారింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఎంతో సహనంతో చేయవలసిన దర్శకత్వ బాధ్యతను నిత్యామీనన్ నిర్వర్తిoచ గలదా? అనే అనుమానం ఎవరికైనా వస్తుంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78406/TOLLYWOOD-GETTING-SHACKED-WITH-NITYAMENON-DECESSION-/
0 comments:
Post a Comment