పవన్‌కళ్యాణో ఇంకొకరో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకి ఎవరో ఒకరు కావాలి ట్విట్టర్‌లో ఆడేసుకోడానికి. 'టెంపర్' సినిమా ట్వీట్లేయడానికి బర్మకి బాగా అక్కరకొచ్చినట్లుంది. కుర్ర ఎన్టీఆర్‌ని పొగడాలంటే సీనియర్ ఎన్టీఆర్‌ని తక్కువ చెయ్యాలా? అనే రీతిలో వర్మ ట్వీట్లేశాడు. ఫాన్స్ హర్ట్ అయ్యారు. అయితే అయ్యారు అది వర్మ అభిప్రాయం. 'నా దృష్టిలో' అని అంటుంటాడు వర్మ. ఏ వివాదమొచ్చినా వర్మ వాదించుకోడానికి రెడీగానే ఉంటాడు. ఫెయిల్యూర్ సినిమాలతోనే వర్మ ఇలా పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారంటారు కొందరు.
వర్మ వెర్షన్ ఇంకోలా ఉంటుంది. నా అభిప్రాయం చెబితే, దాని చుట్టూ వివాదం రాజేస్తారు తప్పితే తానెప్పుడూ వివాదాల కోసం పాకులాడలేదని వర్మ చెప్తాడు. వర్మ చెప్పేదీ నిజమే, వర్మపై వచ్చే ఆరోపణలూ అంతే. వర్మ ట్వీటేస్తే అది సంచలనం, వివాదాస్పదం. ఏయ్ వర్మ ఏసేశాడు అని వర్మ ట్వీట్లపై నెటిజన్స్ కూడా ఫన్నీగా రీట్వీట్లేయడానికి అలవాటుపడిపోయారు. ఒకప్పుడు పెద్ద పెద్ద స్టార్ప్‌ని తయారు చేసి కింగ్ మేకర్ అనిపించుకున్న దర్శకుడు ఇప్పుడు జోకర్ అయిపోయాడంటూ కామెంట్లేసుకుంటున్నారు. కామెంట్లేసే వారి నోళ్లు మూయించే ట్వీట్లు కాకుండా... స్టన్నింగ్ సినిమాలే తీస్తాడని ఆశిద్దాం.
source: http://telugu.gulte.com/tmovienews/8562/Jokes-on-Ram-gopal-varma-tweets#sthash.TMdGsiXW.dpuf

0 comments:
Post a Comment