Menu



భారీ అంచనాలతో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ' సినిమా కు ఫ్లాప్ టాక్ వచ్చినా, ఆ సినిమాను వివాదాలు వదలడంలేదు. ఈ చిత్రానికి వ్యతిరేకంగా హిజ్రాలు (ట్రాన్స్ జెండర్స్) ఆందోళనకు సిద్ధమయ్యారు అనే వార్తలు వస్తున్నాయి. దర్శకుడు శంకర్ ‘ఐ' సినిమాలో చిత్రీకరించిన సీన్స్ తమ మనో భావాలు దెబ్బతీస్తున్నాయని వీరివాదన. ఈసినిమాలో స్టైలిస్ట్ స్పెషలిస్ట్ పాత్రలో నటించి హీరో విక్రమ్ పై పగబట్టిన ఓస్మా పాత్రలో నటించిన ఓజాస్ రజనీ నిజజీవితంలో కూడా చాలా పేరు మోసిన స్టైలిస్ట్ స్పెషలిస్ట్. ఓజాస్ రజనీ ఐశ్వర్యరాయ్ తో పాటు పలవురు బాలీవుడ్ స్టార్స్ కు స్టైలిస్ట్ గా పని చేస్తున్నా విషయం తెలిసిందే.

అయితే ‘ఐ’ సినిమాలో ఓస్మా పాత్రను విలన్ పాత్రగా చూపించడం పట్ల ట్రాన్స్ జెండర్స్ ఆగ్రహంగా ఉండటమే కాకుండా దర్శకుడు శంకర్ ఇంటి ముందు ఆందోళన చేపట్టడానికి ఆలోచనలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమాకు కోలీవుడ్ లో యావరేజ్ టాక్ వచ్చినా ఇప్పటివరకు కలెక్షన్స్ బాగానే ఉండటంతో ‘ఐ’ పరిస్థితి టాలీవుడ్ లో కన్నా కోలీవుడ్ లో కొంచం మేరుగుగానే ఉంది అని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ సినిమా మటుకు టాలీవుడ్ లో ఈసినిమా కొనుక్కున్న బయ్యర్లకు నిద్రలేకుండా చేస్తోందని టాక్

0 comments:

Post a Comment

 
Top