జూనియర్ నటిస్తున్న ‘టెంపర్’ సినిమాకు మరో కొత్త భయం వెంటాడుతోంది అనే వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి లాంటి గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకున్న ‘టెంపర్’ నిర్మాత మరో తప్పటడుగు వేస్తున్నడా అంటూ గాసిప్పులు మొదలు అయ్యాయి. ఈసినిమాను ఫిబ్రవరి 5 లేక 6 తారీఖులలో విడుదల చేస్తాను అని ఈసినిమా నిర్మాత బండ్ల గణేష్ బయటకు చేపుతున్నప్పటికీ బండ్ల గణేష్ మైండ్ లో ఉన్న రిలీజ్ డేట్ ఫిబ్రవరి 13న అని ప్రచారం జరుగుతోంది. కేవలం మిగతా సినిమాల విడుదల తేదీలను అయోమయంలో పెట్టడానికి బండ్ల గణేష్ వ్యూహాత్మక ఎత్తుగడలలో ఇది ఒకటి అనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఈసినిమా నిర్మాణ పనులు ఇంకా నెమ్మదిగా జరగడమే అని అంటున్నారు.
రేపు నందమూరి తారకరామారావు వర్ధంతి రోజున జరుగుతుంది అనుకున్న ఈ సినిమా ఆడియో వేడుక ఈనెల 25కు వాయిదా పడింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ‘టెంపర్’ అనుకున్న డేట్ కు రాదు అనే ప్రచారం ఊపు అందుకుంది. ఇదియిలా ఉండగా ఫిబ్రవరి15 నుంచి వరల్డ్ కప్ క్రికెట్ ప్రారంభమవుతోంది దానికితోడు మార్చి మొదటి వారంలో ప్రారంభం కాబోతున్న ఇంటర్ పరిక్షల తేదీల మొదలు కావడంతో ప్రస్తుతం బండ్ల గణేష్ ‘టెంపర్’ సినిమాకు మరో ఊహించని కష్టాలు మొదలు అయ్యాయి అనే గాసిప్పులు ఈ సినిమా విడుదల పై ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి.

0 comments:
Post a Comment