సినిమారంగం పై సినిమా జయాపజాయల పై ‘బందిపోటు’ ఆడియో ఫంక్షన్ లో దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు టాక్ అఫ్ టాలీవుడ్ గా మారయాయి. తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రోజులలో జరిగిన విషయాన్ని బయట పెట్టాడు రాజమౌళి.
ఆ రోజులలో ఈవివి సత్యనారాయణ, ఎస్ వి కృష్ణారెడ్డిలు టాప్ డైరెక్టర్స్ గా టాలీవుడ్ ను ఎలేవారు అన్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ అప్పటి రోజులలో తాను ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాను తీస్తున్నప్పుడు కొంత భయం కలిగి ఈవివి సత్యనారాయణను కలిస్తే ఆయన చెప్పిన మాటలు తనకు జ్ఞానోదయాన్ని కలిగించాయని అలనాటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు రాజమౌళి. “హిట్ సినిమా తీస్తే ప్రేక్షకులు మనల్ని ఆకాశానికి ఎత్తేస్తారు, సినిమా ఫ్లాప్ అయితే ఎత్తి కింద పడేస్తారు, ఏదీ నిజం కాదు ఏది నిజమో అది మనకు తెలియాలి” అన్న ఈవివి మాటలు తనకు దర్శకత్వానికి సంబంధించి ఒక గురువు చెప్పిన మాటలుగా మారాయి అని అంటూ సినిమా రంగంలో విజయానికి ఎంత ప్రాధాన్యత ఉందో అంతర్లీనంగా తెలియచేసాడు రాజమౌళి.
అయితే అప్పటి ఈవివి మాటలను ఈరోజు రాజమౌళి గుర్తుకు చేసుకోవడం వెనుక ‘బాహుబలి’ సక్సస్ గురించి ఈ స్థాయిలో కూడా రాజమౌళి టెన్షన్ పడుతున్నాడా అని ఆయన మాటలు విన్నవారికి అనిపించింది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76382/RAJAMOULI-SHOCKING-COMMENTS-AT-AUDIO-FUNCTION/

0 comments:
Post a Comment