‘గోపాల గోపల’ సినిమా ప్రమోషన్ కోసం ఛానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన హీరోయిజమ్ పై తనకు తాను చేసుకున్న కామెంట్స్ పవన్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించి నట్లుగా వార్తలు వస్తున్నాయి. తనకు కమర్షియల్ హీరోలకు ఉండవలసిన లక్షణాలు ఏమితనకు లేవని అంటూ తనపై తానే షాకింగ్ కామెంట్స్ చేసుకున్నాడు పవన్. తనకు స్టెప్స్ వేయడం అంటే అసౌకర్యంగా ఫీల్ అవుతాననీ, కానీ కమర్షియల్ సినిమాలకు అవి ప్రాణం కాబట్టి తనకు ఇష్టం లేకపోయినా తన అభిమానుల కోసం ఎంతో కొంత స్టెప్స్ వేయక తప్పడం లేదు అని కామెంట్ చేసాడు పవన్ కళ్యాణ్.
తనకు చిన్నతనం నుండి చాల విచిత్రమైన భయాలు తనను వెంటాడుతూ పెరుగుతూ వచ్చాయని చెపుతూ చిన్నతనంలో తాను గాలిపటాలు ఎగర వేసేడప్పుడు గాలిలో ఎగురుతున్న గాలిపటంతో తాను కూడా ఎగిరిపోతానా అని భయపడేవాడినని అంటూ ఇప్పటికి కూడా తన సినిమాల కోసం ఎతైన కొండలపై ఫైటింగ్ సీన్స్ తీస్తున్నప్పుడు ఆ షూటింగ్ స్పాట్ లో అంతమంది తన చుట్టూ ఉన్నా తాను కొండ నుండి కిందకు పడిపోతానని భయపడుతూ ఉంటానని తన పై తానే జోక్ చేసుకున్నాడు పవన్. ఇక సెట్స్ పై తానెవ్వరితో మాట్లాడక పోవడం గురించి మాట్లాడుతూ తనకు చిన్నతనం నుండి చాల సిగ్గు ఎక్కువని దానితో తాను ముభావంగా ఉంటే చాలామంది అది తన పొగరు అంటూ బిరుదు ఇచ్చారని కామెంట్ చేసాడు పవన్.
విచిత్రం ఏమిటంటే ‘గబ్బర్ సింగ్ లాంటి’ కమర్షియల్ సూపర్ హిట్ సినిమాలకు హీరోగా నటించిన పవన్ కు తనకు కమర్షియల్ హీరోకి ఉండవలసిన లక్షణాలు లేవు అని కామెంట్స్ చేసుకోవడం ఎవరికీ అర్ధంకాని విషయo.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76373/PAVAN-COMMENTS-BECAME-SHOCKING-TO-HIS-FANS/

0 comments:
Post a Comment