టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానాన్ని క్రియేట్ చేసుకున్న విలన్ సోనూసూద్. సోనూసూద్ కి ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా, బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. ఒకప్పుడు బిటౌన్ లో ఆఫర్స్ లో లేక, కేవలం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ మూవీలను చేయటానికి ఇష్టపడిన సోనూసూద్, ఇప్పుడు మాత్రం సౌత్ మూవీలకి దూరంగా ఉండబోతున్నాడు. మేటర్ లోకి వెళితే ‘అరుంధతి’ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన సోనూసూద్ ఆ తరువాత నుండి ఇక వెనుదిరిగి చూడలేదు.
హిందీలో ఈ విధమైన బ్రేక్ సోనూ సూద్ కి ‘దబాంగ్’ సినిమా ద్వారా లభించింది. తనకు దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. సోనూ ఇటీవలే మహేష్ బాబు ఆగడు, హిందీలో షారుక్ హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలలో మనకు కనిపించాడు. అలాగే షారుఖ్ రిఫరెన్స్ తో సోనూసూద్ మరో నాలుగు బిటౌన్ మూవీలలో నటిస్తున్నాడు. ప్రస్తుతం సోనూసూద్ బిటౌన్ లో డిమాండ్ ఉన్న బిజి ఆర్టిస్ట్. రీసెంట్ గా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి మెగా హీరో అల్లుఅర్జున్ దర్శకత్వంలో రాబోతున్న మూవీకి, విలన్ గా సోనూసూద్ ని తీసుకోవాలని ప్రయత్నించారు.
అయితే మొదట ఓకె చెప్పిన సోనూసూద్, చివరి నిముషంలో మాత్రం, తను చేయలేనని హ్యాండ్ ఇచ్చాడంట. కారణం ఏమిటో తెలసుకున్నాక, తనకి బిటౌన్ లో బడా ఆఫర్ రావడంతో, టాలీవుడ్ మూవీకి ముందుగానే కమిట్మెంట్స్ ఇచ్చినా, ఆ కమిట్మెంట్ నుండి తప్పుకున్నట్టుగా తెలియజేసి, మెగాహీరో అల్లుఅర్జున్ కి సారి చెప్పుకున్నాడంట.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76440/sonu-sood-sonu-sood-comedy-sonu-sood-films-sonu-so/

0 comments:
Post a Comment