Menu


నితిన్ పట్ల క్రేజ్ ఎంత ఉందో తెలిపే ఒక విచిత్ర సంఘటన మీడియా ద్వారా విలుగులోకి వచ్చింది. నితిన్ వీరాభిమాని అయిన ఒక అమ్మాయి నితిన్ ను చూసేందుకు అర్దరాత్రి నితిన్ ఇంటి ప్రహరీ గోడ దూకి నితిన్ ఇంటిలోకి వెళ్ళడానికి ప్రయత్నించి వీలు పడకపోవడంతో రాత్రంతా నితిన్ ఇంటి ద్వారం ఎదురుగా పడుకున్న ఒక అమ్మాయి సాహసం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.

ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో ప్రచురించిన కథనం ప్రకారం మొన్న పండుగ రోజు రాత్రి ఒక అమ్మాయి పబ్ కు వెళ్ళి అక్కడ సరదాగా గడిపిన తరువాత జూబ్లీహిల్స్ లోని నితిన్ నివాసం వైపు వెళ్లిందట. అయితే అక్కడ భద్రత ఉండటంతో వెనుక వైపు నుంచి ప్రహరీ గోడ పై నుంచి దూకి నితిన్ ఇంటిలోకి వెళ్లిందట ఆ వీరాభిమాని.  అయితే నితిన్ ఇంటి తలుపులు వేసి ఉండటంతో లోపలకు వెళ్ళడానికి వీలుకాక ఆ మత్తులో అలాగే పడుకుని పోయిందట. అయితే ఉదయం నిద్ర నుంచి లేచిన కుటుంబ సభ్యులు ఇంటి ముందు ఉన్న ఆ యువతిని చూసి ఆశ్చర్యపోయి ఎవరూ అని ప్రశ్నిస్తే తనకు నితిన్ కావాలి అని సమాధానం ఇచ్చిందట.

నేను నితిన్ అభిమానిని.. ఆయన కోసమే ఇక్కడికి వచ్చా’నని స్పష్టం చేసింది. దీంతో నితిన్ తల్లి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఆ యువతిని విచారించగా ఆమె ఓ పోలీసు అధికారి కూతురని తెలిసింది. ‘నేను నితిన్‌ను ప్రేమిస్తున్నానని.. ఆయన లేకుంటే జీవించలేను.. ఆయన్నే పెళ్లి చేసుకుంటా’నని పోలీసులతోనూ స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు ఆ యువతిని ఆమె ఇంటి వద్ద వదిలేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/76388/GIRL-HUNGAAMA-AT-NITHIN-HOUSE/


0 comments:

Post a Comment

 
Top