పవన్ కళ్యాణ్ త్వరలో నటించబోతున్న ‘గబ్బర్ సింగ్ 2’ హీరోయిన్ గా ఎంపిక అయిన అనీషా ఆంబ్రోస్ మొన్న విడుదలైన ‘గోపాల గోపాల’ సినిమాలో టివి జర్నలిస్టుగా కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. అయితే అటువంటి చిన్న రోల్ ను గోపాలుడి సినిమాలో చేయవద్దని ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఆమె సన్నిహితులు కూడా సలహాలు ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు అనీషా. కేవలం ఒక్క నిముషంపాటు కూడా లేని అటువంటి పాత్రను సినిమాలలో ఒప్పుకుంటే ఇక కెరియర్ లో ఎప్పుడూ అటువంటి చిన్న పాత్రలే వస్తాయని చాలామంది భయ పెట్టారని ఈ ‘గబ్బర్ సింగ్ 2’ హీరోయిన్ చెపుతోంది.
అయితే తనకు పవన్ కళ్యాణ్ పట్ల ఉండే విపరీతమైన అభిమానం తన చేత ఈ చిన్న పాత్రను ‘గోపాల గోపాల’ లో చేసేలా చేసిందని అంటూ చాలామంది అనుకుంటున్నట్లుగా తనకు ‘గబ్బర్ సింగ్ 2’ లో చాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈ చిన్న పాత్ర చేయలేదు అని అంటోంది ఈ బ్యూటీ. తన చిన్నతనంలో పవన్ కళ్యాణ్ ఆటోగ్రాఫ్ కోసం పరుగులు పెట్టిన తనకు పవన్ పక్కన నుంచుని మాట్లాడటం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది అని అంటూ ‘గబ్బర్ సింగ్ 2’ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తనకు తెలియకపోయినా తాను కూడా ‘గోపాల గోపాల’ లో నటించాను అని చెప్పుకోవడం తనకు గర్వంగా మారింది అని కామెంట్స్ చేస్తోంది పవన్ హీరోయిన్.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76017/PAVAN-HEROINE-COMMENTS-ON-GOPLA-GOPLA/

0 comments:
Post a Comment