గ్రామీణ వాతావరణానికి ప్రతిబింబంగా నిలిచే తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతిని పవన్ తన ఫాంహౌస్ లో తన సన్నిహితుతులతో ఆనందంగా జరుపుకుంటున్నాడు. అంతే కాదు అక్కడ సరదాగా గాలిపటాల వేడుకను కూడా ఎంజాయ్ చేస్తూ తన స్నేహితులతో, సన్నిహితులతో పండుగను గడుపుతున్నాడని తెలుస్తోంది. పవన్ కు పచ్చని చెట్ల మధ్య ప్రకృతిలో మమేకమవ్వడం అంటే ఎంతో ఇష్టం అందరికీ తెలిసిందే. అందుకే సమయం దొరికినప్పుడల్లా చాలామంది హీరోలులా విదేశాలలోని హాలిడే స్పాట్స్ కు వెళ్ళకుండా తన వ్యవసాయ క్షేత్రంలోనే ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇదే సందర్భంలో పవన్ తన ట్విటర్ లో స్పందించిన విషయం కూడా పవన్ ఉద్దేశాలకు అద్దం పడుతోంది.
రైతు కన్నీరు పెట్టని గ్రామీణ భారతం రావాలని ఆశిస్తూ, అందరికీ పవన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసాడు. అయితే ప్రస్తుతం పవన్ సపోర్ట్ ఇచ్చి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోను అధికారంలో ఉన్న పార్టీలు అన్నీ విదేశాల నుండి వస్తున్న బడా పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతూ ఉంటే పవన్ కలలు కంటున్న రైతు కన్నీరు పెట్టని గ్రామీణ భారతం పగటి కలగానే మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి పవన్ డ్రీమ్ నెరవేరేది ఎప్పుడో.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76239/PAVAN--WITH--KITE/

0 comments:
Post a Comment