సంక్రాంతి పండుగ సందర్భంగా గుణశేఖర్ నిర్మిస్తున్న ‘రుద్రదేవి’ సినిమాలోని అల్లుఅర్జున్ గోన గన్నారెడ్డి పాత్రకు సంబంధించిన మరో న్యూలుక్ ఫోటోలను గుణశేఖర్ మీడియాకు విడుదల చేసాడు. ఈరోజు ఉదయం ఈ సినిమాలోని అల్లుఅర్జున్ గోన గన్నారెడ్డి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. రాణిరుద్రమ చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని ఏర్పరుచుకున్న గోన గన్నారెడ్డి పాత్ర బన్నీ కెరియర్ కు ఒక టర్నింగ్ పాయింట్ గా మారుతుందని ఇప్పటికే ఫిలింనగర్ లో ఊహగానలు ఊపు అందుకున్నాయి.
ఎన్టీఆర్‌కు 'పల్నాటి బ్రహ్మనాయుడు'లా, ఏఎన్నార్‌కు 'తెనాలి రామకృష్ణుడు'లా, కృష్ణంరాజుకు 'తాండ్రపాపారాయుడు'లా, కృష్ణకు 'అల్లూరి సీతారామరాజు'లా బన్నీకి 'రుద్రమదేవి' ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని గుణశేఖర్ బన్నీని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. ఇప్పటి వరకూ పాటలలోని స్టెప్స్ తో ఉర్రూతలూగించిన బన్నీ గోన గన్నారెడ్డిగా రాణిస్తే తెలుగులో చారిత్రాత్మక సినిమాలు చేయడానికి నేటి తరం యంగ్ హీరోలలో ఒక హీరో దొరికాడనే అనుకోవాలి. భారీ అంచనాలతో విడుదల అవుతున్న భారీ బడ్జెట్ సినిమాలన్నీ పరాజయం పొందుతూ ఉండటంతో గుణశేఖర్ కు ‘రుద్రమదేవి’ టెన్షన్ రోజురోజుకు పెంచుతుంది అని ఊహించడంలో ఎటువంటి సందేహంలేదు అనుకోవాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76248/BANNY-IS-COMPARED-WITH-ANBR-AND-NTR/

0 comments:
Post a Comment