నిన్న సంక్రాంతినాడు విడుదలైన అల్లుఅర్జున్ ‘రాణి రుద్రమ’ సినిమాలోని బన్నీ గోనగన్నారెడ్డి పాత్ర ఫస్ట్ లుక్ టీజర్ అందర్నీ బాగా ఆకర్షిస్తోంది. అయితే ఈసినిమాలో బన్నీకి వాడిన కాస్ట్యూమ్స్ అన్నీ నలుపు రంగులో ఉండటం వెనుక ఒక సీక్రెట్ ఉంది అంటూ కథనాలు వినిపిస్తున్నాయి. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకు ప్రముఖ స్థానం ఉన్నా రుద్రమదేవి చరిత్రలో మటుకు గోన గన్నారెడ్డికి ఒక దొంగగానే స్థానం లభించింది రుద్రమదేవి ఆలోచనలను ఎంతగానో ప్రభావితం చేసిన గోన గన్నారెడ్డి పాత్ర రాచరికం పై తిరుగుబాటు చేసే ఒక విప్లవకారుడు. ఆనాటి ప్రజల దృష్టిలో గోనగాన్నారెడ్డి సామంతరాజుల సంపదను దోచుకుని పేదలకు ఇచ్చే మంచి దొంగగా చరిత్రలో స్థానం ఉంది.
ఈవిషయాలను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు గుణశేఖర్ ఈసినిమాలో బన్నీ వేసుకునే డ్రస్సుల నుండి వాడే గుర్రం వరకు అన్నీ నలుపు రంగులో ఉండేలా ఆలోచించి డిజైన్ చేయించాడు అని టాక్. ప్రఖ్యాత డిజైనర్ నీతా లుల్లా ఆధ్వర్యంలో డిజైన్ చేయబడిన బన్నీ కాస్ట్యూమ్స్ అన్నీ ఈసినిమాలోని బన్నీ పాత్రను అనుసరించి ఒక తిరిగుబాటు దారుడి లుక్ కనిపించేలా గుణశేఖర్ తీసుకున్న జాగ్రత్తలు ఈసినిమాకు హైలెట్ గా మారుతాయి అని టాక్. ‘రేసుగుర్రం’ సూపర్ హిట్ తో మంచి క్రేజ్ మీద ఉన్న బన్నీ ఇమేజ్ తో ఈసినిమా మార్కెట్ ను పూర్తి చేయాలని గుణశేఖర్ వేస్తున్న ఎత్తుగడ ఎంతవరకు సక్సస్ ను ఇస్తుందో చూడాలి.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/76300/ALLU-ARJUN-BLACK-SECRECT/

0 comments:
Post a Comment