నాగచైతన్యకు అదృష్టాన్ని కలిగించలేని వ్యక్తి అల్లుఅర్జున్ కు అదృష్టాన్నికలిగించగలడా అనే సెటైర్లు పడుతున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న బన్నీఆ సినిమా తరువాత ఏ సినిమాలో నటిస్తాడు అన్న ఆశక్తి నెలకొనడంతో రకరకాల దర్శకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈనేపధ్యంలో గత సంవత్సరం నాగచైతన్యతో ‘ఒక లైలా కోసం' సినిమాకు దర్శకత్వం వహించిన విజయ్ కుమార్ కొండ అల్లు అర్జున్‌ను కలిసి ఇటీవల ఓ స్టోరీ లైన్ చెప్పాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ స్టొరీ లైన్ బాగా నచ్చడంతో బన్నీ ఆ కథను డెవలప్ చేయమని దర్శకుడు విజయ్ కుమార్ ను కోరినట్లుగా ఫిలింనగర్ టాక్.
అయితే ఈవార్తలు కేవలం ప్రాధమికం మాత్రమే అని అల్లుఅర్జున్ ను ఒక కథ విషయంలో ఒప్పించడం అంత సులువైన విషయం కాదు అనే మాటలు కూడా ఉన్నాయి. గతంలో నితిన్ కు ‘గుండెజారి గల్లంతైయ్యిందే’ సినిమాను తీసి సూపర్ హిట్ కొట్టినా ఆ క్రేజ్ ను తన కెరియర్ కు సంబంధించి సరిగ్గా మలుచుకోలేదు అని దర్శకుడు విజయ్ కుమార్ పై కొన్ని కామెంట్స్ ఉన్నాయి. అయితే గత అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకున్న ఈ దర్శకుడు బన్నీ ఇస్తున్న అవకాశం ద్వారా తిరిగి తన సత్తా చాటే అవకాశం ఉంది. అయితే ఈవార్తలు ఇంకా అధికారకంగా వెల్లడికాలేదు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76426/CHAITANYA-BAD-LUCK-HAUNTING-BANNY/

0 comments:
Post a Comment