Menu


‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినా ఆతరువాత దర్శకత్వం వహించిన ‘రామయ్య వస్తావయ్య’ ఘోర పరాజయం చెందటంతో హరీష్ శంకర్ హవా అయి పోయింది అనుకున్నారు అంతా. అయితే అనుకోకుండా మళ్ళీ అదే మెగా కుటుంబానికి చెందిన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం హరీష్ శంకర్ కు చుక్కానిగా మారాడు.  వీరిద్దరి కాంబినేషన్ లో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతోంది. అయితే హరీష్ శంకర్ కు ఒక సంక్రాంతి సెంటిమెంట్ ఉంది.

గతంలో ఈ దర్శకుడు పవన్ తో ‘గబ్బర్ సింగ్’ తీస్తున్న రోజులలో ఆ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ను 2012 సంక్రాంతినాడు విడుదల చేసాడు.  ఆ సినిమా హరీష్ శంకర్ ను టాప్ డైరెక్టర్ గా మార్చడం తో ఇప్పుడు హటాత్ గా ఆ సెంటిమెంట్ గుర్తుకు వచ్చి ప్రస్తుతం తానూ తీస్తున్న ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ టీజర్ ను ఈ సంక్రాంతి సాయంత్రంలోగా విడుదల చేయాలని నిశ్చయించుకుని ఆ టీజర్ విడుదల కార్యక్రమాన్ని వేగంగా పరుగులు పీట్టిస్తున్నాడు అని టాక్.  మరి హరీష్ శంకర్ సెంటిమెంట్ ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. ఈ సినిమాను కూడా సమ్మర్ రేస్ లో నిలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని టాక్.

source:http://www.apherald.com/Movies/ViewArticle/76266/HARISH-SHANKAR-IS-HAUNTED-BY-PAVAN-SENTIMENT/

0 comments:

Post a Comment

 
Top