దక్షిణాది సినిమారంగం గర్వింప దగ్గ దర్శకులలో శంకర్ ది అగ్రస్థానం అయితే నిన్న విడుదలైన ‘ఐ’ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోలేక పోవడానికి గల కారణం ఆసినిమా కథ లోపమే అన్న కామెంట్స్ సాధారణ ప్రేక్షకుడి నుండి విశ్లేషకుల వరకు ఒకేమాదిరిగా వినిపిస్తున్నాయి. గతంలో తను తీసిన ప్రతి సినిమాలోను ఎదో ఒక మెసేజ్ చెప్పే శంకర్ దీనికి భిన్నంగా ‘ఐ’ ను కథ లేకుండా కేవలం టెక్నాలజీని నమ్ముకుని నిర్మించడం వలనే శంకర్ కు ఆశించిన రిజల్ట్ రాలేదు అనేమాటలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో శంకర్ నిర్మించిన సినిమాలకు మూలకథలు చాలావరకు ఆయనవి కావు, స్క్రీన్ ప్లేలు మాత్రమే ఆయన తయారుచేసేవాడు.
మొదట్లో బాలకుమురన్ అనే సుప్రసిద్ధ తమిళ రచయిత శంకర్ సినిమాలకు కథలు అందించారు. ‘జంటిల్ మన్’, ‘ప్రేమికుడు’, ‘జీన్స్’ సినిమాల కథలు ఆయనవే. ఆతరువాత సుజాత రంగరాజన్ తన కథలను శంకర్ సినిమాలకు ఇచ్చారు. ‘ఒకే ఒక్కడు’, ‘భారతీయడు’, ‘రోబో’ వంటి సినిమాల కథలు ఇచ్చింది సుజాత రంగరాజన్. అయితే ఈరచయితతో శంకర్ కు ఏమి భేదాభిప్రాయాలు వచ్చాయో తెలియదు కాని ఆరచయితను మార్చి శంకర్ తన సొంతంగా కొంతమంది సహాయకుల సహాయంతో ‘ఐ’ సినిమా కథ విషయంలో చేసిన సొంత ప్రయోగం వల్ల శంకర్ పడ్డ కష్టానికి ఫలితం దక్కలేదు అని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. 100 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను తీసిన శoకర్ ఆసినిమా కథ గురించి మర్చిపోవడం మితిమీరిన ఆత్మవిశ్వాసం అనుకోవాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76246/THE-REASON-BEHIND-I-EXPERIMENT-FAILURE/

0 comments:
Post a Comment