Menu


జూ ఎన్టీఆర్, సమంత, ప్రణీత హీరో హీరోయిన్లుగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రభస' చిత్రం ఈ నెల29న అంటే రేపు గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 1200 స్క్రీన్లలో విడుదల ప్లాన్ చేసారు. చాలా చోట్ల ‘రభస' చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ పూర్తైపోయింది. అయితే రేపు మార్నింగ్బెనిఫిట్ షో మాత్రం హైదరాబాద్ లో భ్రమరాంబ థియోటర్ లో తొలి షో పడుతుందని చెప్తున్నారు. నందమూరికళ్యాణ్ రామ్ ఛీఫ్ గెస్ట్ గా ఈ ప్రీమియర్ షో కు హాజరవుతున్నారు.

టిక్కెట్లు కోసం... - (9000202079) (8464997777) (9490870828) (9705823333) నెంబర్లలో సంప్రదించండి.

సాధారణ షోల రేటుకంటే బెనిఫిట్ షో టిక్కెట్ల రేటు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అయితే వీరాభిమానులు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడటం లేదు. ఎన్టీఆర్ అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఆసక్తిగా ఉన్నారు. బుకింగ్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే చాలా భాగం టిక్కెట్లు బుక్కయిపోయాయి.

ఎన్టీఆర్ సినిమాకు ఫస్ట్ డే టిక్కెట్లు సంపాదించడం అంటే కాస్త కష్టమైన విషయమే. టిక్కెట్లు సంపాదించడానికి అష్టకష్టాలు పడిన అభిమానులు టిక్కెట్లు తమ చేతికి రాగానే చాలా రిలాక్స్‌గా ఫీలవుతున్నారు. టిక్కెట్లు దొరికిన విషయాన్ని సోషల్ మీడియాలో గొప్పగా ప్రకటించుకుంటున్నారు.




0 comments:

Post a Comment

 
Top