Menu


హదయ కాలేయం' సినిమాతో సంపూర్ణేష్ బాబు టాలీవుడ్లో సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. టైటిల్ దగ్గర నుండి సినిమా వరకు అంతా వెరైటీనే అందులో. తాజాగా మరో వెరైటీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు సంపూర్ణేష్ బాబు. ఈ సినిమాకు ‘వైరస్ డాట్ కామ్'(www.virus.com) అనే టైటిల్ ఖరారు చేసారు. బి వేర్ అనేది ట్యాగ్ లైన్. ఈచిత్రానికి సి.హెచ్.శివరామకృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడు. ఎ.యస్.ఎన్ ఫిలింస్ పతాకం పై సలీం, ఎ.జె.రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తారు. దసరా నాటికి సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. దర్శకుడు మాట్లాడుతూ - ''మా హీరో సంపూర్నేష్ బాబు ని ఈ చిత్రంలో సరికొత్త కోణంలో చూపిస్తున్నాము. ఈ కథకి హీరో కరెక్ట్ గా సెట్ అయ్యాడు. సంపూర్నేష్ బాబు నుండి ఎలాంటి వినోదాన్ని ప్రేక్షకులు కోరుకుంటారో అది ఈ చిత్రంలో పూర్తిగా ఉంటుంది" అని అన్నారు.

హీరో సంపూర్నేష్ బాబు మాట్లాడుతూ 'ఈ చిత్రం నాకు మంచి పేరు తెస్తుంది. నా ఇమేజ్ రెట్టింపు అవుతుంది. నేను చేసే పాత్ర చాలా వెరైటీగా ఉంటుంది. అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘స్టోరీ చాలా వెరైటీగాఉంది. మాస్, క్లాస్ ప్రేక్షకుల మాత్రమే కాకుండా, అన్ని వర్గాలకు రీచ్ అయ్యేలా స్టోరీ ఉంది. నేటి వాస్తవ పరిస్థితులని ప్రతిభింభింస్తూ, నేటి యువతరాన్ని ఉత్తేజపరుస్తూ వినూత్నగా సాగుతుంది' అన్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ - వి.జే, కథా విస్తరణ, మాటలు - దుర్గా ప్రసాద్ రాయుడు, నిర్మాతలు : సలీం, ఏ.జె.రాంబాబు, కథ-స్క్రీన్ ప్లే -దర్శకత్వం - సి.హెచ్.శివరామ కృష్ణ . త్వరలో మిగతా నటీనటుల్ని, సాంకేతిక నిపుణలని తెలియజేస్తామని నిర్మాతలు ఒక ప్రకటనలో తెలిపారు.

0 comments:

Post a Comment

 
Top