ఇంకా సినిమాకు కొబ్బరికాయే కొట్టలేదు.. అంతలోనే ఈ బడ్జెట్ కష్టాలేమిటో అర్థం కావడం లేదు. శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్ చేయబోయే సినిమాకు బడ్జెట్ కష్టాలు మొదలయ్యాయని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ వార్తల్లో వాస్తవం లేకపోలేదు. ఈ మధ్య ఓ పెద్ద హీరో, ఓ పెద్ద దర్శకుడు కలిశారంటే తక్కువలో తక్కువ బడ్జెట్ 35 కోట్లు దాటిపోతోంది. మనం చర్చించుకుంటున్న సినిమా విషయానికే వస్తే.. చరణ్, శ్రీను వైట్లల రెమ్యూనరేషన్ కలిపితే దాదాపు 17, 18 కోట్ల దాకా ఉంటుంది.
వైట్ల ఆర్నెల్లుగా వేర్వేరు రచయితలతో కలిసి స్టోరీ సిట్టింగ్స్ పేరుతో ఇప్పటికే నిర్మాత డీవీవీ దానయ్యతో చాలా ఖర్చు చేయించాడు. ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు చాలదన్నట్లు కోన వెంకట్, గోపీ మోహన్ కలిసేసరికి వాళ్లకు కోటిన్నర దాకా చెల్లించుకోక తప్పదట. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు రూ.2.5 కోట్ల దాకా పారితోషకం ఇవ్వబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. సినిమాలోని మిగతా కాస్టింగ్ అంతా కలుపుకుంటే ప్రొడక్షన్‌కు కాకుండానే రూ.25 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. సినిమాకు కనీసం ఇంకో 20 కోట్లన్నా పెట్టాల్సిందే. చరణ్ మార్కెట్ ఇప్పుడు రూ.40 కోట్ల దగ్గర ఫిక్స్ అయి ఉంది. అంటే వైట్లతో చేసే సినిమా రూ.50 కోట్లు వసూలు చేస్తే తప్ప దానయ్య సేఫ్ అయ్యే పరిస్థితి లేదన్నమాట. పెద్ద నిర్మాతలంతా పెద్ద హీరోలతో సినిమాలు తీయడానికి ఎందుకు జంకుతున్నారో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంది?
source: http://telugu.gulte.com/tmovienews/8565/Budget-problem-for-Ram-charan-movie#sthash.fpimnoq9.dpuf
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.