Menu

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న మెగా హీరో పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజగా నటించిన గోపాల గోపాల మూవీ బాక్సాపీస్ వద్ద సక్సెస్ ఫుల్ కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది. మూవీని కొన్న ప్రతి ఒక్కరూ పెద్దగా లాభాలు లేకపోయినప్పటికీ, హ్యాపీగా ఉన్నట్టు మార్కెట్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్2 మూవీకి సంబంధించిన పనుల్లో బిజిగా ఉన్నాడు. ఈ మూవీ అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళుతుంది. ఇందులో హీరోయిన్ గా కమల్ హాసన్ రెండో కూతురు అయిన అక్షర హాసన్ నటించే అవకాశం ఉందని టాక్స్ వినిపించాయి. టాలీవుడ్ కి చెందిన ఓ మేనేజర్ గతంలో అక్షర హాసన్ ని కలిసి, పవన్ కళ్యాణ్ సరసర గబ్బర్ సింగ్2 లో నటిస్తావా? అంటూ ప్రపోజల్ పెట్టాడంట.

అందుకు తెలివిగా ఆలోచించిన అక్షర హాసన్, “ఆ ఆఫర్ తనని నమ్మి ఇచ్చినందుకు పవన్ కి ధన్యవాదాలు. కాని టాలీవుడ్ లో నా మొదటి మూవీనే పెద్ద హీరోతో అంటే, తరువాత నా మీద భారీ హాప్స్ ఉంటాయి. వాటిని నేను రీచ్ కాలేకపోతే ఫిల్మ్ కెరీర్ డైలమాలో పడుతుంది. సాధారణ స్టార్ డం కలిగి హీరోల వద్ద నుండి టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రి ఇస్తాను” అంటూ క్లియర్ గా చెప్పుకొచ్చిందట.

దీంతో అక్షర హాసన్, పవన సరసన నటించటానికి నో చెప్పేసిందంటూ కోలీవుడ్ లోనూ టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ వద్ద నుండి ఆ మేనేజర్ గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తరువాతే, అక్షర హాసన్ ని తను కలిసినట్టు తెలిసింది. గబ్బర్ సింగ్ లో అక్క శ్రుతిహాసన్ తో కలిసి నటించిన పవన్, సీక్వెల్ లో చెల్లి అక్షర హాసన్ తో నటిద్దామని పవన్ స్కెచ్ వేశాడని టాలీవుడ్ టాక్స్

source:http://www.apherald.com/Movies/ViewArticle/77389/Pawan-target-tollywood-telugu-films-telugu-news-ga/

0 comments:

Post a Comment

 
Top