కొన్నిరోజుల క్రితం పవన్ తన ట్విట్టర్ ఖాతాను తెరవగానే కొన్ని గంటలలోనే లక్షల మంది పవన్ ట్విట్టర్ కు ఫాలోయర్స్ గా మారిపోయారు. అంతే కాదు ఈబలమైన వెబ్ మీడియా ద్వారా తన అభిమానులతో నిరంతరం పవన్ టచ్ లో ఉంటాడని చాలా మంది భావించారు. అధికారంలో ఉన్న నాయకులను ప్రశ్నించడానికి ‘జనసేన’ పార్టీ పెట్టిన పవన్ అనుకున్నవిధంగా ప్రశ్నించకున్నా కనీసం వర్తమాన సామజిక పరిస్థితులపై, సమస్యల పై తన అభిప్రాయాలను తన ట్విటర్ ద్వారా తరుచు వ్యక్త పరుస్తాడు అని చాలా మంది భావించారు.
కానీ పవన్ ఇక్కడ కూడా తన అభిమానులను నిరాశ పరిచాడు అనే వాదన ఉంది. పవన్ తన ట్విటర్ ఎకౌంటు ప్రారంభించిన నాటి నుంచి కనీసం ఒక పది ట్విట్స్ కుడా తన ట్విటర్ ఎకౌంటు లో పోస్ట్ చేయలేదు. పవన్ ట్విటర్ ఎకౌంటు ప్రారంభించాక ఎన్నో సంఘటనలు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. ఆ సంఘటనల పై తమ అభిమాన హీరో ఎలా స్పందిస్తాడు అన్న ఆశతో పవన్ అభిమానులు ఆశక్తి తో ఎదురు చూసారు అనే వార్తలు ఉన్నాయి.
అయితే పవన్ తన ట్విట్టర్ లో కుడా తన వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగించడం పవన్ అభిమానులకు అర్ధం కాని పజిల్ లా మారిందని టాక్. ఒక వైపు అoదరి టాప్ హీరోలులా వరసగా సినిమాలు చేసే మనస్తత్వం పవన్ కు లేకపోయినా సామాజిక చైతన్యం విపరీతంగా ఉన్న పవన్ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ ట్విటర్ ఆయుధాన్ని కూడా పవన్ సక్రమంగా ఉపయోగించు కోవడంలేదు అనే విమర్శలు ఉన్నాయి.
ఒక వైపు హైదరాబాద్ కార్పోరేషన్ కు ఎన్నికల హడావిడి మొదలవుతున్న నేపధ్యంలో అటు రాజకీయంగా ఇటు సినిమాల పరంగా ప్రతి విషయంలోనూ మౌనమే నా భాష అంటూ ప్రస్తుతం పవన్ ప్రవర్తిస్తున్న తీరు చాలామందికి ముఖ్యంగా పవన్ అభిమానులకు నిరాశకు గురి చేస్తోంది అనే కామెంట్స్ వినపడుతున్నాయి మరి పవన్ ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి..
0 comments:
Post a Comment