Menu

balayya-boyapati
బాలకృష్ణలాంటి మాస్‌ హీరోని హ్యాండిల్‌ చేయడం అంత మామూలు విషయం కాదు. ఏ హీరోతో అయినా హిట్‌ ఇవ్వవచ్చు కానీ బాలకృష్ణకి ఉన్న ఇమేజ్‌కి తగ్గట్టు ఒక పకడ్బందీ మాస్‌ సినిమా తీయడం ఓ ఆర్టు. బి. గోపాల్‌ తర్వాత అంతటి విద్యని చూపించిన ఒకే ఒక్క దర్శకుడు బోయపాటి శ్రీను. అయితే బి. గోపాల్‌ని మిగతా హీరోలు ఎంకరేజ్‌ చేసినట్టుగా  బోయపాటి శ్రీనుని మాత్రం గుర్తించడం లేదు.

 సింహా ఫ్లూక్‌ కాదని లెజెండ్‌తో ప్రూవ్‌ చేసినా బోయపాటి శ్రీను ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాడు. పెద్ద హీరోలు తనని పట్టించుకోకపోవడంతో యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమా చేయడానికి రాజీ పడిపోయాడు. కానీ అదేమో అర్ధాంతరంగా ఆగిపోయింది. దాంతో బోయపాటి శ్రీనుకి మళ్ళీ ఒక ఏడాది గ్యాప్‌ వచ్చేసింది. 


సమరసింహారెడ్డి, నరసింహనాయుడులాంటి సినిమాలు తీస్తే బి. గోపాల్‌ వెనుక చిరంజీవి, ఎన్టీఆర్‌ ఎగబడిపోయారు. కానీ బోయపాటిని మాత్రం ఈతరం హీరోలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఎన్టీఆర్‌తో తీసిన దమ్ము అనుకున్నంత రేంజ్‌కి చేరకపోయినా బ్యాడ్‌ ఫిలిం అయితే కాదు. ఆ మాటకొస్తే ఇంతదాకా బోయపాటికి ఫెయిల్యూర్‌ లేదు. టాలెంట్‌కి ఏమాత్రం లోటు లేకపోయినా అదృష్టం మాత్రం ఇతడికి ఆమడ దూరం అనుకోవాలేమో. 

0 comments:

Post a Comment

 
Top