Menu

rajasekhar-s-gaddam-gang-sensor-report
యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు సంపాదించుకున్న టాలీవుడ్  ఇండస్ట్రీ  హీరో డా.రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన గడ్డం గ్యాంగ్ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. గడ్డం గ్యాంగ్ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ను ప్రశంసించారు.ముక్యంగా రాజశేఖర్ యాక్టింగ్ గురించి సెన్సార్ సభ్యులు మరింతగా పొగిడేసారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా చిత్రాన్ని తెరకెక్కించారని మెచ్చుకోవడం విశేషం.

ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈనెల 6న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. రాజశేఖర్ నటించిన చిత్రాన్ని చాలా కాలం తరువాత పూర్తి హైప్ తో రిలీజ్ చేయటం విశేషంగా మారింది.ఎందుకటే గతంలో రాజశేఖర్ నటించిన మూవీలకు కనీసం బిజినెస్ కూడ కాక, రిలీజ్ కి నోచుకోవటానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాజశేఖర్ నటించిన గడ్డం గ్యాంగ్ మూవీకి పూర్తి బిజినెస్ హంగులతో రిలీజ్ కి సిద్ధం అవుతుండంతో, ఈ మూవీపై రాజశేఖర్ హోప్స్ పెట్టుకున్నాడు. తమిళంలో విజయవంతమైన సూదుకవ్వమ్ చిత్రానికి రీమేకిది.

జర్నీ ఫేం శరవణన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన పి.సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శివాణి శివాత్మిక మూవీస్ పతాకంపై జీవితా రాజశేఖర్ నిర్మించారు. రాజశేఖర్ సరసన షీనా కథానాయికగా నటించింది. కామెడీ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. సంగీత దర్శకుడు అచ్చు మ్యూజిక్ అందిచడమే కాకుండా ఓ ప్రత్యేక పాత్రలో నటించడం స్పెషల్ ఎట్రాక్షన్. నోయల్, సత్యం రాజేష్, నరేష్, సీత ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

0 comments:

Post a Comment

 
Top