Menu

prabhas-naga-chithanaya
తెలుగు ఫిల్మ్ ఇండస్త్రీలో 6అడుగుల పొడవు వున్నవాళ్ళు చాలా మందే ఉన్నారు. అందులోనూ మన యువ హీరోలలో 6 అడుగుల 2 అంగుళాల పొడుగుతో అమ్మాయిల కలల రాజకుమారుడిగా కనిపించే ప్రభాస్ కంటే నాగచైతన్యకు ఎక్కువ రేటింగ్స్ పడటం అందరి ద్రుష్టిని ఆకర్షిస్తోంది. నమ్మ శక్యం కాని ఈ నిజాన్ని ఈరోజు ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ప్రచురించిన ‘హాట్ బ్యాచిలర్ ఎలర్ట్’ శీర్షికతో ప్రచురించిన ప్రత్యేక కధనంలో ఈ రేటింగ్స్ ను వివరించింది.

టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్ళికి రెడీగా ఉన్న ఆరుగురు బ్యాచిలర్ హీరోలను వారి ప్రత్యేకతలను వివరిస్తూ, ఆ పత్రిక పెళ్ళి కొడుకులుగా వారిపై రేటింగ్స్ ఇచ్చింది. ఈ రేటింగ్స్ లో కొన్ని విభాగాలలో ప్రభాస్ కంటే నాగచైతన్యకు రేటింగ్స్ బాగా వచ్చాయి. ప్రభాస్ ను అత్యంత ఖరీదైన పెళ్ళి కొడుకుగా నిర్ణయిస్తూ ఎత్తైన కొండ పై కూర్చునే సెక్సీ బ్యాచలర్ గా అభివర్ణిస్తే, నాగచైతన్యను తన కాబోయే మామగారికి ముద్దుల అల్లుడిగా మావగారు ఇష్టపడే అల్లుడిగా చైతన్యకు మంచి రేటింగ్స్ ఇచ్చింది. ఇక నితిన్ విషయానికి వస్తే ఏకంగా 5 స్టార్లు వేస్తూ మంచి తెలుగు అబ్బాయిగా బిరుదు కూడా ఇచ్చేసింది ఆ పత్రిక.

రామ్ విషయంలో వ్యాఖ్యలు రాస్తూ రాముడు మంచి బాలుడు అంటూ కామెంట్స్ చేసి అమ్మాయిల తండ్రులకు ఇష్టపడే పెళ్ళి కొడుకుగా మార్చేసింది. ఇక అల్లరోడు అల్లరి నరేష్ కు రేటింగ్స్ ఇస్తూ మినుమమ్ గ్యారంటీ హీరోలా మాత్రమే కాకుండా చిలిపి అల్లుడిగా నరేష్ రాణిస్తాడు అని రేటింగ్స్ వేసింది. ఇక ఎప్పుడూ గాసిప్పుల్లో ఉండే రానా పై రేటింగ్స్ ఇస్తూ అమ్మాయిలను ఆకర్షించే ఐస్కాంతం లాంటి అల్లుడు రానా అంటూ రేటింగ్స్ ఇచ్చింది.

ఇంకా ఇమేజ్, నెట్ వర్త్, మ్యారేజ్ ఎబిలిటీ లాంటి ఎన్నో విషయాల పై ప్రస్తుతం టాలీవుడ్ లో అందమైన యంగ్ బ్యాచలర్స్ గా హవా కొనసాగిస్తున్న టాప్ యంగ్ హీరోల పై ఆ జాతీయ పత్రిక ప్రచురించిన రేటింగ్స్ ఆశక్తికరంగా ఉన్నాయి.

0 comments:

Post a Comment

 
Top