ఫిలింనగర్ లో వినిపించే కొన్ని కొన్ని వార్తలు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అయితే ఆ వార్తలు నిజమో కాదో తెలియక పోయినా విన్నప్పుడు మాత్రం షాకింగ్ న్యూస్ లుగా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ‘గొపాల గోపాల’ కు సంబంధించి ఒక షాకింగ్ రూమర్ ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా విషయంలో హర్ట్ అయ్యాడంటే మళ్లీ అలాంటి దర్శక నిర్మాతల విషయంలో చాల దూరంగా ఉంటాడు అని ఆయన సన్నిహితులు అంటుంటారు. అంతేకాదు తనను డబ్బులు సంపాదించి పెట్టే యంత్రంగా భావిస్తూ చుట్టూ చేరి భజన చేసే వ్యక్తులను కూడా పవన్ దగ్గరకు రానీయడని కొందరంటారు.
ఈ విషయం నిజమే అనేలా ‘గోపాల గోపాల’ సినిమాకు నిర్మాణ భాధ్యతలు నిర్వహించిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబుతో పవన్ కు భేదాభిప్రాయాలు వచ్చాయని ఫిలింనగర్ లో వార్తల హడావిడి జరుగుతోంది. దీనికి కారణం ఈసినిమాకు మరో నిర్మాతగా వ్యవహరించిన పవన్ స్నేహితుడు శరత్ మరార్ కు, సురేష్ బాబుకు వచ్చిన భేదాభిప్రాయాలు అని టాక్.
శరత్ మరార్‌కు సంబంధించిన నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు ‘గోపాల గోపాల’ సినిమాకు సంబంధించి రావలసిన లాభాల వాటాల్లో తేడా రావడమే పవన్ కోపానికి కారణం అని అంటున్నారు. ఈ కోపంతో ఇక తాను భవిష్యత్ లో సురేష్ ప్రొడక్షన్ సంస్థతో సినిమాలు చేయకూడదని పవన్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియక పోయినా ఆశ్చర్య కరమైన ఈ వార్తలు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారాయి.
0 comments:
Post a Comment