Menu

junior-ntr-releases-new-poster-temper-ntr
భారీ అంచనాలతో ఈ నెల 13న తన టెంపర్ ను చూపెట్టి టాలీవుడ్ రికార్డులను క్రియేట్ చేద్దామని ప్రయత్నిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఒక సాధారణ కోడి సవాల్ విసరబోతోంది అన్న వార్తలు ఫిలింనగర్ ను షేక్ చేస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త నిర్మాత రామోజీరావు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తో కలిసి తీసిన ‘దాగుడుమూతల దండాకోర్’ జూనియర్ ‘టెంపర్’ ను టార్గెట్ చేస్తూ అదే రోజు విడుదల అవుతూ ఉండటం షాకింగ్ గా మారింది.

తమిళంలో విజయవంతమైన ‘శైవం’ సినిమాను తెలుగులో ‘దాగుడుమూతల దండాకోర్’ గా రీమేక్ చేసారు. రాజేంద్రప్రసాద్ తాతగా, బేబీ సారా మనవరాలిగా నటిస్తున్న ఈ సినిమా చాలా బాగా వచ్చిందని ఫిలింనగర్ టాక్. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే సినిమాగా ఇది ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చాలామందిని ఆకర్షిస్తోంది. రెండురోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చాలామందిని ఆకర్షిస్తోంది.

తప్పిపోయిన ఒక కోడి కోసం ఒక పల్లెటూరులోని ధనవంతుల కుటుంబం సాగించే అన్వేషణ చుట్టూ ఈ సినిమా కథ చాల హాస్య భరితంగా సాగుతుంది. ఆ పల్లెటూరుకి పెద్దమనిషిలా ఉండే రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులంతా పండుగకని ఆ ఊరికి వస్తారు. అయితే వారందరికీ రకరకాల సమస్యలు ఉండటంతో ఆ ఊరి గుడిలో అమ్మవారికి పూజ చేసి వారు అప్పటి వరకు చాల ముద్దుగా పెంచుకున్న కోడిని బలి ఇద్దామనుకుంటారు.

అయితే వీరి మాటలను పసిగట్టిన ఆ కోడి సరిగ్గా పూజ జరిగే సమయానికి తప్పించుకుని పోతుంది. ఆ తరువాత జరిగే హాస్య సన్నివేశాల చుట్టూ చక్కటి పాటలతో గ్రామీణ నేపధ్యంలో నిర్మింప బడ్డ ఈ చిన్న సినిమా జూనియర్ టెంపర్ తో ఏ ధైర్యంతో పోటీకి దిగుతోంది అన్న విషయం ప్రశ్నగా మారిపోతోంది. వ్యాపార వేత్తగా ఎన్నో తెలివి తేటలు ఉన్న రామోజీరావు తన నిర్మాణ సంస్థ ద్వారా గతంలో తన బేనర్ ద్వారా హీరోగా పరిచయం చేసిన జూనియర్ కు పోటీగా ఇప్పుడు తన కోడిని నిలపడం టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది..

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77774/HEN-BECOMING-THREAT-TO-JUNIOR/

0 comments:

Post a Comment

 
Top