తెలుగు సినిమాల్లో ఎన్టీఆర్ 'టెంపర్' కొత్త రికార్డ్ సృష్టించింది. నెంబర్ వన్ మూవీగా రికార్డులకెక్కింది. సినిమా విడుదల కాకుండానే 'టెంపర్'ని రికార్డులు వరించాయి. ఈ రికార్డులు వివాదాల పరంపరలో కావడం ఇంకో రికార్డ్. హీరోకీ డైరెక్టర్‌కీ పడలేదట. హీరోకీ హీరో అక్కగా నటించిన యంగ్ హీరోయిన్‌కీ గొడవలొచ్చాయట. నిర్మాతకీ హీరోకీ, నిర్మాతకీ డైరెక్టర్‌కీ వివాదాలు వచ్చాయంట. డబ్బింగ్ చెప్పను పొమ్మన్నాడట. నాకేం సంబందం లేదని డైరెక్టర్ చేతులెత్తాశాడంట అని ఎన్నెన్నో వివాదాలతో 'టెంపర్' రికార్డులు సృష్టించేసింది. అయితే ఈ వివాదాల సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చాయి.
నిర్మాత, దర్శకుడు, హీరో ఎక్కడా ఈ వివాదాలపై స్పందించలేదు. స్పందించి, వాటికి పబ్లిసిటీ ఇవ్వడం సమంజసం కాదనుకుని ఉంటారు. వివాదాలతో సినిమాకి దిష్టి పోయిందని ఫాన్స్ అనుకుంటున్నారట. 'టెంపర్' వసూళ్ళ రికార్డుల్ని తిరగరాస్తుందని, పూరి జగన్నాథ్ అన్నట్టుగానే ఎన్టీఆర్ హీరోగా టాప్ రేంజ్‌లో ఉంటాడని ఫాన్స్ నమ్ముతున్నారు. 'టెంపర్'కి హిట్ టాక్ వస్తే వివాదాలన్నీ మటాష్ అయిపోతాయి. ఎన్ని వివాదాలైనా సినిమా రిలీజ్ అయ్యేదాకానే. ఆ తర్వాత రికార్డుల గురించి తప్ప వివాదాల గురించి మాట్లాడరెవరూ.
source: http://telugu.gulte.com/tmovienews/8581/Temper-movie-controversies#sthash.nJOOg5uk.dpuf
0 comments:
Post a Comment