పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఇద్దరూ ఇప్పుడు నంబర్‌వన్ రేసులో ఉన్నారనేది తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలు కలిసి కనిపించేది చాలా అరుదు. ఇద్దరి మధ్య స్నేహ సంబంధాలు ఉన్నా కానీ కలిసి మాత్రం కనిపించరు. అర్జున్ పైరసీ వ్యవహారంలో మహేష్ ఇబ్బందుల్లో పడ్డప్పుడు పవన్‌కళ్యాణ్ అతడికి బహిరంగ మద్దతు తెలిపి, సంఘీభావం తెలిపాడు. ఆ తర్వాత ఇద్దరూ హీరోలుగా ఉన్నత స్థానాలకి ఎదిగి.. టాప్ ప్లేస్ కంటెండర్స్ అయ్యారు. వేడుకలకి కూడా అరుదుగా వచ్చే ఈ ఇద్దరినీ కలిసి చూడడం దాదాపు అసాధ్యమైపోతోంది.
ఇలావుంటే వీరిద్దరూ కలిసి నటిస్తారంటూ పలుమార్లు వదంతులు వినిపిస్తుంటాయి. కలిసి నటించడం మాటేమో కానీ ఈ ఇద్దరూ కలిసి ఒక ఆడియో వేడుకకి వస్తారని ప్రచారం స్టార్ట్ అయింది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న అల్లు అర్జున్ సినిమా 'సన్నాఫ్ సత్యమూర్తి' ఆడియో వేడుకకి 'సూపర్-పవర్'ని తీసుకు రావాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఇద్దరికీ త్రివిక్రమ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ కనుక అతను తలచుకుంటే ఇది జరిగే అవకాశముంది. జులాయి ఆడియో వేడుకకి పవన్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈమధ్య ఇతర మెగా హీరోల ఈవెంట్స్‌లో పవన్ కనిపించడం లేదు. నిజంగా మహేష్, పవన్ కనుక వస్తే 'సన్నాఫ్ సత్యమూర్తి' ఈవెంట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
source: http://telugu.gulte.com/tmovienews/8582/Pawan-kalyan-and-Mahesh-babu-for-Son-of-Satyamoorthi-Audio-launch#sthash.lfYQPKQj.dpuf
0 comments:
Post a Comment