ఇప్పటి వరకు కొనసాగుతున్న సస్పెన్స్ కు తెర దించుతూ ఈరోజు ప్రేమికుల దినోత్సవం రోజున టాలీవుడ్ లవర్ బాయ్ గా మారబోతున్న అఖిల్ వినాయక్ ల సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేసారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ప్రొడక్షన్ నెంబర్ వన్ అని కాకుండా ప్రొడక్షన్ A అని ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ‘A’ అన్న అక్షరం అఖిల్ కు సంకేతంగా వాడారా? లేదంటే ఈ A వెనుక ఏమైనా సెంటిమెంట్ ఉందా? అన్న కోణంలో చర్చలు సాగుతున్నాయి.
ఇప్పటి వరకు యాక్షన్ సినిమాలను తీసిన వినాయక్ తొలిసారిగా అఖిల్ కు ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ తో ఒక మాస్ హీరోగా ఎలా చూపెడతాడు అన్న ఆ శక్తి అందరిలోనూ ఉంది. ప్రముఖ హీరో దిలీప్ కుమార్, సైరా భాను దంపతుల మనవరాలు సయేష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు కూడా చాల ఘాటుగా ఉంటాయని టాక్.
అంతేకాకుండా నేటి తరం యూత్ ను ఆకట్టుకోవడానికి ఒక డీప్ లిప్ లాక్ సీన్ ఈ సినిమాలో ఉండేడట్లుగా దర్శకుడు వినాయక్ ఇప్పటికే ప్లాన్ చేసాడు అని అంటున్నారు. ఎన్నో భారీ అంచనాలతో నేడు షూటింగ్ ప్రారంభం అవుతున్న ఈ సినిమాకు అభినందనలు తెలియచేస్తూ ప్రముఖ పత్రికలలో పేజీల కొద్ది యాడ్స్ రిలీజ్ చేసారు అంటే అఖిల్ ను టాలీవుడ్ లో ఏ విధంగా ఎలివేట్ చేయబోతున్నారో అర్ధం అవుతుంది.
అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను ఈ దసరాకు విడుదల చేయాలని ఈ సినిమా దర్శక నిర్మాతల ఆలోచన అని అంటున్నారు. ఏది ఏమైనా ప్రేమికుల రోజున అఖిల్ హంగామా అందర్నీ ఆకర్షిస్తోంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78710/AKHIL-A-SENTIMENT/

0 comments:
Post a Comment