Menu

పవన్ కళ్యాణ్ ను తన దేముడుగా అభివర్ణించు కునే నితిన్ లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీర్ పై చేసిన కామెంట్స్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయాయి. తన ప్రతి సినిమాలోను పవన్ నామస్మరణ చేసే నితిన్ ఇలా యూటర్న్ తీసుకోవడం ఏమిటి అని చాలామంది ఆశ్చర్య పోతున్నారు.

ఈ వారం విడుదల కాబోతున్న జూనియర్ ‘టెంపర్’ పై కామెంట్స్ చేస్తూ ఈ సినిమాలోని పాటలు, యాక్షన్ ఎపిసోడ్ చూసాక ఎన్టీఆర్ లోని అద్భుత నటుడు తనకు కనిపించాడని కామెంట్ చేసాడు నితిన్. అంతేకాదు ఈ సినిమా టైటిల్ జూనియర్ సినిమాలలో బెస్ట్ టైటిల్ అంటూ జూనియర్ ఆకాశానికి ఎత్తేశాడు.

బహిరంగంగా ఒక హీరో మరో హీరో సినిమాకు సంబంధించి ప్రశంసలు కురిపించడం చాల అరుదైన విషయం. అయితే నితిన్ ఇంతటి పోటీ వాతావరణంలో కూడా మరో హీరో సినిమాను ప్రశంసించి ఆ సినిమా క్రేజ్ ను మరింత పెంచడం మరో కొత్త సాంప్రదాయానికి తెర తీసింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పటి దాక రాజమౌళి మాత్రమే విడుదలైన మంచి సినిమాల పై కామెంట్స్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా మారుతూ వచ్చాడు. ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని నితిన్ కొనసాగిస్తున్నాడు అనుకోవాలి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78218/NITHIN-COMMENTS-ON-JUNIOR/

0 comments:

Post a Comment

 
Top