Menu


మిల్కీ బ్యూటీ తమన్నాకు గత సంవత్సరం ఏ మాత్రం కలిసి రాకపోవడంతో ఇక తన రూట్ మార్చి ఒకప్పుడు తనకు హిట్స్ అందించిన కోలీవుడ్ పై కన్నేసింది. ప్రస్తుతం ఈమె తమిళంలో ఆర్య హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  కోలీవుడ్ ప్రేక్షకులను బుట్టలో పడేయాలి అనుకుంటే అక్కడి ప్రేక్షకుల అభిరుచుల మేరకు హీరోయిన్స్ తమ శరీర ఆకృతిలో మార్పులు చేసుకుని తీరాలి. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకునే కాబోలు తమన్నా కూడా బొద్దుగా మారడానికి ప్రయత్నిస్తోంది. దీనికి ఉదహరణగా ఈమధ్య ఆమె పాల్గొన్న ఒక పబ్లిక్ ఫంక్షన్ లో ఆమె లుక్ ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ఒక వ్యాపార సంస్థ సంక్రాంతి లక్కీ డ్రా కార్యక్రమానికి తమన్నా ఇలా బొద్దుగా తయారై వచ్చిన తమన్నాను చూసి ఈమె ఒకప్పటి మిల్కీ బ్యూటీ ఏనా అని గుసగుసలాడుకోవడం వినిపించింది.  అయితే తమన్నా ఇంత బొద్దుగా మారడం వెనుక కోలీవుడ్ ప్రేక్షకులను ఆకర్షించడానికా లేదంటే ఈమధ్య ‘బాహుబలి’ కోసం తీవ్రంగా చేసిన కసరత్తుల ప్రభావమా అనే ఆ కార్యక్రమానికి వచ్చిన చాలామంది కామెంట్లు చేసుకున్నారు అని టాక్

source:http://www.apherald.com/Movies/ViewArticle/76470/SECRECT-BEHIND-TAMANAAH-NEW-LOOK/

0 comments:

Post a Comment

 
Top