ఈరోజుతో రెండవ వారంలోకి ప్రవేశిస్తున్న ‘గోపాల గోపాల’ సేఫర్ జోన్ లోకి ప్రవేసించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈసినిమా విడుదలైన మూడవరోజు నుండి కలెక్షన్స్ విషయంలో డ్రాప్ ఏర్పడటంతో ‘గోపాల గోపాల’ బయ్యర్లు విపరీతంగా టెన్షన్ పడ్డారు. అయితే వరస పెట్టి వచ్చిన సంక్రాంతి సెలవులు ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో సంక్రాంతి పండుగ పట్ల ప్రజలకు ఉండే సరదా గోపాలుడిని కొంత వరకు రక్షించినట్లే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈసినిమా మొదటి వారం పూర్తి చేసుకునే సరికి ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల కలెక్షన్స్ మైలురాయిని దాటిందని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తల పై ఈ సినిమా నిర్మాతలు అధికారికంగా ఇప్పటికీ స్పందించకపోవడంతో ఈ సినిమా పై క్రేజ్ పడిపోకుండా ఈ ప్రచారాన్ని వ్యూహాత్మకంగా చేస్తున్నారా? లేదంటే నిజంగానే గోపాలుడు సేఫర్ జోన్ లోకి ఎంటర్ అయ్యాడా? అనే విషయం పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకా 20 కోట్లు వసూలు చేస్తే కాని ఈ సినిమా లాభాల బాట పట్టదు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో సెలవులు తరువాత రాబోతున్న వచ్చే వారం ఈ సినిమాకు కీలకంగా మారింది. మరో వైపు ‘ఐ’ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడం కూడా, వచ్చే వారం గోపలుడిని రక్షిస్తుంది అనే టాక్ ఉంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76384/-GOPALA-GOPALA-ENTERS-SAFER-ZONE/

0 comments:
Post a Comment