Menu


సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది గొప్ప దర్శకులు ఉన్నారు. అయితే ప్రస్తుత తరంలో కమర్షియల్ మూవీలను సక్సెస్ బాటలో నడుపుతున్న ఇద్దరి అగ్ర దర్శకులలో శంకర్, రాజమౌళి పేర్లను చెప్పుకోవచ్చు. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి మూవీలను తెరకెక్కిస్తున్న శంకర్, ఇప్పటి వరకూ ఎన్నో బ్లాక్ బస్టర్, సక్సెస్ ఫుల్ మూవీలను తెరకెక్కించాడు. ఇప్పుడు శంకర్ మూవీలు అంటే ఓ బ్రాండ్. తన మూవీల కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేసే ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే కోట్ల రూపాయలను అవలీలగా ఖర్చుపెట్టే నిర్మాతలు సైతం ఉన్నారు. అలాగే రాజమౌళి కూడ ఈ తరహా బ్రాండ్ నే క్రియేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం తను తెరకెక్కించిన బాహుబలి చిత్రం త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ జరగని ఓ అద్భుతం జరుగుతుందని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం, అంతా గ్రాఫికల్ వర్క్ తో కూడుకున్నది కావడంతో, రాజమౌళి మూవీపై డొమెస్టిక్ మార్కెట్ లోనూ, అటు ఇంటర్నేషనల్ మార్కెట్ లోనూ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కార్పోరేట్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కూడ బాహుబలి రిజల్ట్ కోసం ఆసక్తి చూపుతున్నారు. ఒక వేళ బాహుబలి మూవీ గ్రాండ్ సక్సెస్ అయిందంటే, ఓ ఇంటర్నేషనల్ కంపెనీ ఇండియాలో తీయబోతున్న గ్రాఫికల్ ఓరియంటెడ్ తరహా, భారీ బడ్జెట్ మూవీకి శంకర్, రాజమౌళిలను దర్శకులుగా ఎంపిక చేయనుంది. దీంతో ఒకే మూవీకి ఇద్దరు దర్శకలు పనిచేయనున్నారు.

మొదటి యూనిట్ గా శంకర్, రెండవ యూనిట్ గా రాజమౌళి ఆ గ్రాఫికల్ భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఆ ఇంటర్నేషనల్ కంపెనీ, వారి ప్రాజెక్ట్ ని ఈ ఇద్దరి దర్శకులని వివరించింది. అందుకు శంకర్, రాజమౌళిలు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ, వారు బాహుబలి రిజల్ట్ చూసిన తరువాత, మిగతా చర్చలను ప్రారంభిద్దాం అని చెప్పారంట. అంతా ఓకే ఈ ఇద్దరి గ్రేట్ డైరెక్టర్స్ ఒకే మూవీ కోసం పనిచేయడాన్ని మనం చూడవచ్చు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/76146/Tollywood-telugu-films-Shankar-rajamouli-eega-I-ba/

0 comments:

Post a Comment

 
Top