Menu

pawan-kalyan-surya

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌కి తన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌, బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌ ఇచ్చిన దర్శకుడు ఎస్‌జె సూర్య. హిట్‌ సినిమా 'ఖుషి', ఫ్లాప్‌ సినిమా 'కొమరం పులి'. సూర్య డైరెక్టర్‌ మాత్రమే కాదు. అతను మల్టీ టాలెంటెడ్‌ సినీ సెలబ్రిటీ. యాక్టింగ్‌ చేస్తాడు, మ్యూజిక్‌ ఇంట్రెస్ట్‌ కూడా ఉంది. లవ్‌ స్టోరీస్‌తో పాపులర్‌ అయిన సూర్య మ్యూజిక్‌ నేపథ్యంలో 'ఇసాయ్‌' మూవీ రూపొందించి ఓకే అన్పించాడు. కమర్షియల్‌ కోణంలో ఆలోచించకుండా 'ఇసాయ్‌' సినిమాని నిర్మించాడు. 

డైరెక్షన్‌ చేస్తూ యాక్టింగ్‌ మ్యూజిక్‌, ప్రొడక్షన్‌ అన్నీ చూసుకుంటూ 'ఇసాయ్‌'తో హిట్‌ కొట్టాడు ఎస్‌జె సూర్య.తన డ్రీమ్‌ నెరవేరిందని 'ఇసాయ్‌' విడుదల అనంతరం హ్యాపీగా చెబుతూ, కమర్షియల్‌ సినిమాల గురించి ఆలోచించడం స్టార్ట్‌ చేశానన్నాడీ మల్టీ టాలెంటెడ్‌ డైరెక్టర్‌. మహేష్‌తో 'నాని' అనే ఫ్లాప్‌ మూవీ తీసింది ఈయనే. మ్యూజికల్‌ థ్రిల్లర్‌ తెరకెక్కించాలనే సరదా తీర్చుకున్న ఎస్‌జె సూర్యకి నటన కాదు. కానీ ఇక నుంచి నటన కన్నా డైరెక్షన్‌పైనే దృష్టిపెడ్తాడట. టాలీవుడ్‌పై మళ్ళీ కన్నేసిన సూర్య, ఓ తెలుగు హీరోతో టచ్‌లో ఉన్నాడంటున్నారు. 

0 comments:

Post a Comment

 
Top