మొన్నటివరకు పూరి కళ్యాణ్ రామ్ ల కొత్త సినిమా వార్తలతో హడావిడి చేసిన మీడియా ఇప్పుడు ఏకంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ కళ్యాణ్ రామ్ ల మల్టీ స్టారర్ కు కౌంట్ డౌన్ మొదలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. జూనియర్ ‘టెంపర్’ ఫిబ్రవరిలో విడుదల అవుతూ ఉండటంతో ఆ తరువాత పూరీకి అంతా ఖాళీయే. కాని మిగిలిన డైరక్టర్లయితే ఓకె కానీ, పూరి ఖాళీగా వుండే టైపు కాదు అన్న విషయం తెలిసిందే.
రెండు రోజుల్లో కథ ఆలోచించి, వారం రోజుల్లో స్క్రిప్ట్ రాసి, రెండు నెలల్లో సినిమా తీసేసే రకం పూరి. ఈ స్వభావ రీత్యా పూరి ఈ సారి తన కొత్త సినిమా విషయంలో ఏకంగా ప్రభాస్ కళ్యాణ్ రామ్ లను కలిపే ఆలోచనలో పడ్డాడని టాక్. మహేష్, వరుణ్ తేజ్ సినిమాల విషయం తేలక పోవడంతో ఈ కాంబినేషన్ కు పూరి రంగం సిద్ధం చేస్తున్నాడు అని అంటున్నారు. ప్రస్తుతం ‘బాహుబలి’ షూటింగ్ పూర్తి కావడంతో ‘బాహుబలి 2’ కు సంబంధించిన మిగతా షూటింగ్ ప్రారంభం కావడానికి మరో నాలుగు నెలలు పట్టే అవకాశం ఉంది.
ఈ గ్యాప్ లో ప్రభాస్ మరో సినిమా చేయబోతున్న నేపధ్యంలో పూరి ప్రభాస్, కళ్యాణ్ రామ్ లను కలిపే ఆలోచన చేస్తున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఆలోచన కళ్యాణ్ రామ్ కు కూడా నచ్చడంతో తానే స్వయంగా ఈ మల్టీ స్టారర్ ను నిర్మిస్తాడు అనే వార్తల హడావిడి జరుగుతోంది. ‘పటాస్’ సూపర్ హిట్ కావడంతో ఈ క్రేజ్ తన అభిమానులు మరిచి పోకుండా ప్రభాస్ తో ఒక భారీ మల్టీ స్టారర్ తో వస్తే ఈ హిట్స్ పరంపర కొనసాగి కమర్షియల్ హీరోగా కళ్యాణ్ రామ్ పూర్తిగా నిలబడే అవకాశం ఉంది.
ఈ వ్యూహాత్మక ఎత్తుగడతోనే పూరి కళ్యాణ్ రామ్ లు చేస్తున్న ప్రయత్నాలకు ప్రభాస్ కూడా ఓకె చేస్తే ఇదే సంవత్సరం మరో భారీ మల్టీ స్టారర్ విడుదలకు మార్గం ఏర్పడుతుంది. పూరి ప్రభాస్ ల మధ్య ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఈ ప్లాన్ సక్సస్ అయ్యే అవకాశాలు చాల ఉన్నాయి అనే మాటలు వినిపిస్తున్నాయి.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77359/PRABHAS-KALYAN-RAM-MALTISTARER-ON-CARDS/

0 comments:
Post a Comment