రివ్యూ: యమలీల 2
రేటింగ్: 2/5
బ్యానర్: క్రిష్వీ ఫిలింస్
తారాగణం: డా॥ కె.వి. సతీష్, మోహన్‌బాబు, దియా నికోలస్, బ్రహ్మానందం, సయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, సదా, నిషా కొఠారి తదితరులు
మాటలు: గంగోత్రి విశ్వనాధ్, భవాని ప్రసాద్
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: శ్రీకాంత్ నారోజ్
నిర్మాణం: క్రిష్వీ ఫిలింస్
కథ, కథనం, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి
విడుదల తేదీ: నవంబర్ 28, 2014
రేటింగ్: 2/5
బ్యానర్: క్రిష్వీ ఫిలింస్
తారాగణం: డా॥ కె.వి. సతీష్, మోహన్‌బాబు, దియా నికోలస్, బ్రహ్మానందం, సయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, సదా, నిషా కొఠారి తదితరులు
మాటలు: గంగోత్రి విశ్వనాధ్, భవాని ప్రసాద్
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: శ్రీకాంత్ నారోజ్
నిర్మాణం: క్రిష్వీ ఫిలింస్
కథ, కథనం, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి
విడుదల తేదీ: నవంబర్ 28, 2014
గతంలో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలని అందించిన ఎస్వీ కృష్ణారెడ్డి చాలా గ్యాప్ తర్వాత ‘యమలీల 2’ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలీ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ‘యమలీల’ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. దానికి సీక్వెల్‌గా కె.వి. సతీష్ అనే కొత్త హీరోని పరిచయం చేస్తూ, యముడి పాత్రలో మోహన్‌బాబుతో కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఈ ‘యమలీల’ కూడా భవిష్యవాణి నేపథ్యంలోనే సాగుతుంది.
కథేంటి?
కేన్సర్‌తో బాధ పడుతోన్న తన అన్నయ్య కూతుర్ని రక్షించుకోవడం కోసం ఒక మెడిసిన్ తయారు చేస్తోన్న క్రిష్ (సతీష్) దానికి అవసరమైన మూలికల కోసం హిమాలయాల్లోని మానస సరోవరానికి వెళతాడు. అక్కడకి దేవకన్యల నాట్యం చూడడానికి వచ్చిన యముడి (మోహన్‌బాబు) జాడ కనిపించక, తన చేతిలోని భవిష్యవాణిని క్రిష్ చేతికి ఇచ్చి వెళతాడు చిత్రగుప్తుడు. భవిష్యవాణిని తెరిచి చూసిన క్రిష్‌కి మూడు రోజుల్లో తను చనిపోతున్నాడని తెలిసి... పాప ప్రాణం కాపాడే వరకు భవిష్యవాణిని వారికి ఇవ్వకూడదని దానిని దాచేస్తాడు.
కళాకారుల పనితీరు:
యముడి పాత్రలో ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌గా నిలిచారు మోహన్‌బాబు. ఇంతకుముందే యముడి పాత్రలో కనిపించి మెప్పించిన మోహన్‌బాబు మరోమారు ఆ పాత్రకి జీవం పోసి యముడి వేషంలో కైకాల సత్యనారాయణకి సరితూగే నటుడు తానే అని నిరూపించారు. అయితే మోహన్‌బాబుని పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయారు. చిత్రగుప్తుడిగా సీక్వెల్‌లోను బ్రహ్మానందమే చేసినప్పటికీ ‘యమలీల’లో ఈ పాత్రతో పండిరచిన వినోదాన్ని ఈసారి రిపీట్ చేయలేకపోయారు.
కొత్త నటుడు సతీష్‌లో ఆ కొత్తదనం ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. డైలాగ్ మాడ్యులేషన్‌పై శ్రద్ధ పెట్టాలి. హీరోయిన్ దియాకి పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. సదా, నిషా కొఠారి చెరో పాటలో మెరిసారు. సయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి కామెడీ విలన్ క్యారెక్టర్స్ చేసారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో ‘కృష్ణం భజే’ పాట వినసొంపుగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓల్డ్ స్కూల్‌ని తలపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. కొత్త హీరో అని చూడకుండా భారీగా ఖర్చు పెట్టారు. ప్రొడక్షన్ వేల్యూస్ సినిమాకి మరో హైలైట్‌గా నిలిచాయి. విజువల్ ఎఫెక్ట్స్ ఫర్వాలేదు. ఎలాంటి కాన్సెప్ట్ తీసుకున్నా వినోదంతో కథని నెరేట్ చేయడం కృష్ణారెడ్డి స్పెషాలిటీ. నైంటీస్‌లో ఇవివి తర్వాత అంతగా కామెడీని పండిరచిన దర్శకుడు ఈయనే. అయితే తన ముద్రని ఈ చిత్రంలో చూపించలేకపోయారు. కామెడీ ఉన్నా కానీ అంతగా పండలేదు. ట్రెండ్‌కి తగ్గట్టు కృష్ణారెడ్డి తనని తాను అప్‌డేట్ చేసుకోలేకపోయారు.
హైలైట్స్:
- యముడి పాత్రలో మోహన్‌బాబు
- ప్రొడక్షన్ వేల్యూస్
డ్రాబ్యాక్స్:
- అవుట్ డేటెడ్ నెరేషన్
- మితి మీరిన మెలోడ్రామా
విశ్లేషణ:
‘యమలీల’ చిత్రం అప్పట్లో సంచలనం కావడానికి చాలా అంశాలు కలిసొచ్చాయి. అలీని హీరోగా పెట్టి సినిమా తీయడమే పెద్ద సర్‌ప్రైజ్ ఎలిమెంట్ అయితే.. మదర్ సెంటిమెంట్‌ని, యముడు`చిత్రగుప్తుడు క్యారెక్టర్స్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ని పర్‌ఫెక్ట్‌గా బ్లెండ్ చేసి కృష్ణారెడ్డి మ్యాజిక్ చేసారు. దానికి తోడు ‘సిరులొలికించే చిన్ని నవ్వులే’, ‘నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో..’ వంటి సూపర్‌హిట్ సాంగ్స్.. సూపర్‌స్టార్ కృష్ణపై తీసిన ‘జుంబారే జుజుంబారే’ స్పెషల్ సాంగ్ లాంటి ఎన్నో బోనస్‌లు కూడా ఉండడంతో ‘యమలీల’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది.
ఇరవయ్యేళ్ల తర్వాత మళ్లీ అదే మ్యాజిక్‌ని రిపీట్ చేయాలని చూసిన కృష్ణారెడ్డి దాదాపుగా ఆ కథనే కాస్త అటు, ఇటు మార్చి సీక్వెల్ తీసారు. కాకపోతే యమలీలలోని కామెడీ కానీ, కదిలించే సెంటిమెంట్ కానీ ఇందులో రీక్రియేట్ చేయలేకపోయారు. అందులోని తోట రాముడు, కోట చేసిన ఎస్సై క్యారెక్టర్స్ లాంటివి కూడా ఇందులో మిస్ అయ్యాయి. ‘యమలీల’ బ్రాండ్‌ని మరోసారి వాడుకోవడం మినహా కథ, కథనాల పరంగా శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల ఈ సీక్వెల్.. ఒరిజినల్ దరిదాపులకి కూడా వెళ్లలేకపోయింది.
ఫస్ట్ హాఫ్‌లో మెలోడ్రామా ఎక్కువయింది. కేన్సర్ ట్రీట్‌మెంట్ కోసం మెడిసిన్ తయారు చేయడమనే ఆ తంతు అంతా లాజిక్‌కి అతీతంగా ఉంది. యముడు, చిత్రగుప్తుడి మీద ఫోకస్ ఎక్కువ పెట్టడం వల్ల సెకండ్ హాఫ్ బెటర్ అనిపిస్తుంది. ఈ చిత్రానికి యమలీల బ్రాండ్ ఎంత హెల్ప్ అవుతుందో అంతే మైనస్ కూడా అవుతుంది. హై స్టాండర్డ్ సెట్ చేసిన సినిమాకి సీక్వెల్ అని చెప్పినప్పుడు అన్నీ అందుకు అనుగుణంగానే ఉండాలి. ఒరిజినల్‌కి ఎందులోను సరితూగలేకపోవడం ఈ చిత్రానికి అతి పెద్ద మైనస్‌గా మారింది. ఇక ‘యమలీల’ బ్రాండ్, పబ్లిసిటీ హెల్ప్‌తో ‘యమలీల 2’ ఎలా ఫేర్ చేస్తుందనేది చూడాలి.
0 comments:
Post a Comment