ఒక టైమ్‌లో ఎక్కడ చూసినా రాణా, త్రిష ఇద్దరూ కలిసి కనిపిస్తుండే వారు. తమ గురించి ఏవేవో పుకార్లు వినిపిస్తున్నా కానీ వాటికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేయలేదు. తనకి లవర్ అంటూ ఉంటే త్రిషలా ఉంటుందని, ఎవరికైనా ఐలవ్యూ చెప్పాల్సి వస్తే త్రిషకే చెప్తానని రాణా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాడు. ఈ స్నేహం నెక్స్‌ట్ లెవల్‌కి వెళుతుందేమో అనుకుంటుండగా త్రిష అసలు బాయ్‌ఫ్రెండ్ గురించి న్యూస్ లీక్ అయింది. వరుణ్ మనియన్‌తో ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది కాబట్టి ఇక రాణా గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు.
అయితే ఇంతకుముందు త్రిషతో అంత క్లోజ్‌గా ఉన్న రాణా ఇప్పుడు ఆమెతో ఏ విధంగానూ ఇంటరాక్ట్ కాకపోవడం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. త్రిష ఎంగేజ్‌మెంట్ అయినా మాట మాత్రంగా అయినా తన శుభాకాంక్షలని రాణా పబ్లిక్ ఫోరంలో చెప్పలేదు. మొబైల్‌కి ఏమైనా పర్సనల్ మెసేజ్ పంపించాడేమో తెలీదు కానీ ఈమధ్య తనకి అమ్మాయిల మనసు అర్థం కాదు, వారిని ఎలా మచ్చిక చేసుకోవాలో తెలీదంటూ స్టేట్‌మెంట్స్ ఇస్తున్నాడు.
source:http://telugu.gulte.com/tmovienews/8476/Rana-maintains-space-for-Trisha

0 comments:
Post a Comment