Menu

kajal-night-shoping

షూటింగ్ స్పాట్‌లో అంద‌రితోనూ స‌ఖ్య‌త‌గా ఉంటాన‌ని అంటోంది టాలీవుడ్ బ్యూటీ కాజ‌ల్‌. త‌న కొలీగ్స్ ని ఎప్పుడూ హ‌ర్ట్ చేయ‌ద‌ట కాజ‌ల్‌. ఆమె త‌న గురించి ఈ మ‌ధ్య చాలా విష‌యాల‌ను చెప్పుకొచ్చింది. టెంప‌ర్ సినిమాలో తొలిసారి త‌న‌ని తెర‌పైచూసుకోకుండా తార‌క్ ని చూస్తూ కూర్చున్నాన‌ని చెప్పింది.

ఈ పంజాబీ బ్యూటీకి  ఎక్కువ‌గా రాత్రుళ్లు షాపింగ్ చేసే అల‌వాటు ఉంద‌ట‌. ఆ స‌మ‌యంలో మేక‌ప్ కూడా వేసుకోద‌ట‌. అస్త‌మానం త‌న‌చుట్టూ మేకప్ మేన్ ఉంటే ఆమెకి న‌చ్చ‌ద‌ట‌. ఆ విష‌యాన్నే కాజ‌ల్ చెప్పుకొచ్చింది. రాత్రుళ్ల‌లో షాపింగ్‌కి వెళ్లేట‌ప్పుడు నేను మేక‌ప్ మేన్‌ని వెంట‌పెట్టుకోను. మేక‌ప్ కూడా వేసుకోను. నాతో ఇప్ప‌టిదాకా ఎవ‌రూ ఎప్పుడూ అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించ‌లేదు. అందువ‌ల్ల ఎలాంటి భయమూ లేదు ,నాకు హ్యాపీగా ఉంది. అని చెప్పుకొచ్చిందీ సుంద‌రి.

0 comments:

Post a Comment

 
Top